నూతన విద్యావిధానం.. ఆత్మనిర్భర్ భారత్‌లో కీలకమైన ముందడుగని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. బంగాల్ బీర్‌భూమ్ జిల్లాలోని విశ్వభారతి వర్సిటీ స్నాతకోత్సవంలో వర్చువల్ ద్వారా ఆయన పాల్గొన్నారు. ఈ విద్యావిధానం వల్ల.. విద్యార్థులను పరిశోధన, సృజనాత్మకతవైపు నడిపించేందుకు బలాన్ని చేకూర్చిందన్నారు.
ఈ నేపథ్యంలో విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు మోదీ.
ఓ వైపు అనేకమంది విద్యావంతులు.. ప్రపంచవ్యాప్తంగా హింస, ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుంటే.. మరోవైపు ప్రజలను కరోనా నుంచి కాపాడేందుకు కొంతమంది వారి జీవితాలనే పణంగా పెడుతున్నారు. సమస్యను సృష్టించే వైపునకు వెళ్లాలో.. లేక సమస్యను పరిష్కరించే మార్గాన్ని ఎంచుకోవాలో.. విద్యార్థులు చేతిలోనే ఉంది. విజ్ఞానం, నైపుణ్యం.. విద్యార్థులను సమాజంలో తలెత్తుకునేలా చేస్తాయి. కానీ వాటిని చెడుకు వాడితే.. విద్యార్థులను చీకట్లోకి నెట్టేస్తాయి. జయాపజయాలు మన భవిష్యత్‌ను నిర్దేశించవు. మీ ఉద్దేశం సరైనదైతే పరిష్కారం ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడానికి భయపడొద్దు.
-- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.