తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈ ఏడాది వర్చువల్​గా 'పరీక్షా పే చర్చ' - PM Modi latest tweets

విద్యార్థులు పరీక్షల సమయంలో ఒత్తిడిని జయించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా సలహాలిచ్చే 'పరీక్షా పే చర్చ' ఈ సారి వర్చువల్​గా జరగనుంది. ఇందుకోసం రిజిస్ట్రేషన్​ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది.

PM Modi's 'Pariksha Pe Charcha' to be held online due to COVID-19: Education Minister
'ఈ ఏడాది వర్చువల్​గా 'పరీక్షా పే చర్చ''

By

Published : Feb 18, 2021, 11:56 AM IST

పరీక్షల సమయం దగ్గర పడుతున్న కొద్దీ విద్యార్థుల్లో క్రమంగా ఒత్తిడి పెరగడం సహజం. ఈ సమయంలో ఆ ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి? భయం, ఆందోళనలను ఎలా జయించాలి? వంటి అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా సలహాలిచ్చే కార్యక్రమం.. 'పరీక్షా పే చర్చ'. తాజాగా.. కరోనా కారణంగా ఈ ఏడాది ఆన్​లైన్​ వేదికగా జరగనుంది ఈ కార్యక్రమం. ఇందుకోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. గురువారం నుంచి మార్చి 14 వరకు విద్యార్థులు తమ పేర్లను రిజిస్ట్రేషన్​ చేసుకునే వెసులుబాటు కల్పించింది కేంద్రం.

అత్యంత ప్రజాదారణ పొందిన ఈ కార్యక్రమానికి ఈసారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అవకాశం కల్పించినట్టు మోదీ తెలిపారు. 'వివిధ అంశాలపై సరదాగా చర్చ సాగే కార్యక్రమం ఇది. నా విద్యార్థి మిత్రులు, వారి తల్లిదండ్రులు, కష్టించి పనిచేసే ఉపాధ్యాయులు ఈ ఏడాది పరీక్షా పే చర్చలో పెద్దఎత్తున పాల్గొంటారని ఆశిస్తున్నాను,' అని మోదీ ట్విట్టర్​ వేదికగా తెలిపారు.

నరేంద్ర మోదీ ట్వీట్​

'పరీక్షా పే చర్చ 2021'లో.. మోదీని ప్రశ్నలు అడిగే విద్యార్థులను పోటీ ద్వారా ఎంపిక చేయనున్నారు. ఇందుకు సంబంధించిన వెబ్​సైట్​ లింక్​ను ట్విట్టర్​లో షేర్​ చేశారు. ఈ పోటీలో అర్హత సాధించిన విద్యార్థులు.. దిల్లీలో మోదీతో వీడియో కాన్ఫరెన్స్​లో మాట్లాడే అవకాశాన్ని దక్కించుకుంటారు. 9-12వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే ఇందుకు అర్హులు.

పరీక్షల సమయంలో కలిగే ఒత్తిడి, భయం, ఆందోళనలను జయించేందుకు విద్యార్థులు ఏం చేయాలో చెప్పేందుకు 2018 నుంచి 'పరీక్షా పే చర్చ' కార్యక్రమం నిర్వహిస్తున్నారు మోదీ.

ఇదీ చదవండి:'అందరికీ టీకా.. 2021లోనే అతిపెద్ద సవాల్​'

ABOUT THE AUTHOR

...view details