ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ గురువారం కొవిడ్ టీకా తొలి డోసు తీసుకున్నారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించారు మోదీ.
95 ఏళ్ల హీరాబెన్ మొదటి డోసు తీసుకోవడంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని కోరారు.
టీకా తీసుకున్న ప్రముఖులు...
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ గురువారం ఎయిమ్స్ దిల్లీలో కొవిడ్ టీకా తొలి డోసు తీసుకున్నారు.
బంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్కర్, ఆయన సతీమణి సుదేశ్ ధన్కర్.. కోల్కతాలోని కమాండ్ ఆసుపత్రిలో కొవిడ్ టీకా డోసు తీసుకున్నారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే గురువారం ముంబయిలో టీకా తీసుకున్నారు.
ఇదీ చదవండి:తాజ్మహల్లో పూజలు చేసిన ముగ్గురు అరెస్టు