ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి తన వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. స్వాతంత్ర్య, గణతంత్ర వేడుకలకు ప్రత్యేకంగా కనిపించే ఆయన.. ఈసారీ వైవిధ్యమైన తలపాగా ధరించారు.
మోదీది మళ్లీ అదే స్టైల్- ఈసారి కోల్హాపురీ తలపాగాతో... - modi news
వైవిధ్యమైన వస్త్రధారణలో మెరిసే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఈ సారీ ఆనవాయితీని కొనసాగించారు. కాషాయ రంగు తలపాగా చుట్టుకున్న ఆయన.. ఎరుపు-తెలుపు వర్ణంలో ఉన్న కండువా ధరించారు.
మోదీ తలపాగా
75వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా 'కోల్హాపురీ ఫెతా'గా పిలిచే పొడవైన కాషాయ రంగు తలపాగా చుట్టుకున్నారు మోదీ. కాలి మడమల వస్త్రం ఉండటం ఈ తలపాగా ప్రత్యేకత. ఎరుపు రంగు డిజైన్తో దీన్ని రూపొందించారు. ఎప్పట్లాగే కుర్తా-చుడిదార్ ధరించారు. పైన జాకెట్ వేసుకున్నారు. ఎరుపు-తెలుపు వర్ణంలో ఉన్న కండువాను మెడలో వేసుకున్నారు.
ప్రధానమంత్రిగా గతంలోనూ వైవిధ్యంగా కనిపించారు మోదీ.
Last Updated : Aug 15, 2021, 10:34 AM IST