PM MODI WOMENS DAY: మహిళలను దేశ అభివృద్ధిలో భాగస్వాములుగా చేయడమే తమ ప్రధాన లక్ష్యమని ప్రధాని మోదీ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గుజరాత్లోని కచ్ జిల్లాలో మహిళా సాధువులు నిర్వహించిన సెమినార్కు హాజరయ్యారు. భూమిని తల్లిగా భావించే భారతదేశంలో మహిళల ప్రగతి.. దేశాన్ని మరింత శక్తివంతంగా చేస్తుందన్నారు. అబ్బాయిలు, అమ్మాయిలు సమానమని భావించి.. మహిళల వివాహ వయస్సును 18 నుంచి 21 పెంచాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.
'దేశ అభివృద్ధిలో మహిళలు భాగస్వాములు కావాలి' - womens day speech modi
PM MODI WOMENS DAY: దేశ అభివృద్ధిలో మహిళలను భాగస్వాములుగా చేయడమే తమ ప్రధాన లక్ష్యమని ప్రధాని మోదీ తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా కచ్ జిల్లాలో జరిగిన సెమినార్లో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. స్త్రీ, పురుషులు సమానమని భావించి మహిళల వివాహ వయస్సును పెంచాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ
మహిళా సాధికారత కోసం.. సాధువులు తీవ్రంగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఈ సదస్సుకు 500 మందికి పైగా మహిళా సాధువులు హాజరయ్యారు. సొంతంగా వ్యాపారాలు చేయాలనుకున్న మహిళలకు ఆర్థిక సాయం అందిస్తామని ప్రధాని తెలిపారు.
ఇదీ చదవండి:'ఈడీ అధికారులు భాజపాకు ఏటీఎంలా మారారు'
Last Updated : Mar 8, 2022, 11:33 PM IST