PM MODI WOMEN EMPOWERMENT: డబుల్ ఇంజిన్ ప్రభుత్వం గడిచిన ఎనిమిదేళ్లలో మహిళలకు సాధికారత కల్పించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారతదేశ అభివృద్ధికి మహిళల సాధికారత అత్యావశ్యకమని ఉద్ఘాటించారు. ఆర్మీ నుంచి గనుల దాకా.. అన్ని రంగాల్లో మహిళల సంక్షేమం కోసం విధానాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. మహిళలకు ఇప్పుడు అన్ని మార్గాలు తెరిచే ఉన్నాయని అన్నారు. గుజరాత్ పర్యటనలో ఉన్న ఆయన వడోదరలో రూ.21వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గిరిజన మహిళలకు పోషకాహారం అందించే కార్యక్రమాన్ని సైతం ప్రారంభించారు.
మహిళా సాధికారతతోనే భారత్ అభివృద్ధి: మోదీ - మోదీ మహిళా సాధికారత
PM MODI WOMEN EMPOWERMENT: భారత్ అభివృద్ధి చెందాలంటే మహిళలకు సాధికారత కల్పించడం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లో రూ.21 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన.. మహిళల సంక్షేమం కోసం అన్ని రంగాల్లో విధానాలు రూపొందిస్తునట్లు తెలిపారు.
PM MODI WOMEN EMPOWERMENT
"21వ శతాబ్దంలో భారత్ అభివృద్ధి చెందాలంటే మహిళలకు సాధికారత కల్పించడం అవసరం. ఇందుకోసమే ప్రభుత్వం విధానాలు రూపొందించింది. మహిళలు తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకునేందుకు అన్ని అడ్డంకులను తొలగించింది" అని మోదీ వివరించారు.
ఇదీ చదవండి: