అనుకున్న రీతిలో ఉద్యమం చేయడంలో రైతులు విఫలమైతే అది ప్రధాని మోదీ విజయం అవుతుందని హెచ్చరించారు భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు బల్బీర్ సింగ్ రాజేవల్. రైతులను అవమానించేలా కేంద్రం ప్రవర్తించిందని మండిపడ్డారు.
"రైతుల ఆందోళన నేపథ్యంలో దిల్లీలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేసింది కేంద్ర ప్రభుత్వం. రైతుల ప్రతిష్టకు భంగం కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ తరుణంలో ఆందోళన శాంతియుతంగా చేపట్టాలని రైతులను కోరుతున్నా. అందరూ రైతులకు మద్దతుగా నిలవాలి. ఇతరుల ప్రేరణతో ఆవేతపూరిత చర్యలకు పాల్పడొద్దు. ఇది మన దేశం. మనం వెళ్తోంది యుద్ధం చేయడానికి కాదు అనేది అందరం గుర్తుంచుకోవాలి."