తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న మోదీ - Cyclone Tauktae

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. బుధవారం గుజరాత్​, దీవ్ ప్రాంతాలకు వెళ్లనున్నారు. తౌక్టే తుపాను అనంతర పరిస్థితులపై సమీక్ష నిర్వహించనున్నారు. తుపాను విలయంతో కలిగిన నష్టాన్ని అంచనా వేయనున్నారు.

PM Modi will visit Gujarat,
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మోదీ పర్యటన

By

Published : May 18, 2021, 9:38 PM IST

ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం.. గుజరాత్​ వెళ్లనున్నారు. తౌక్టే తుపాను అనంతర పరిస్థితులపై సమీక్ష నిర్వహించనున్న ప్రధాని.. నష్టాన్ని అంచనా వేయనున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాలైన దీవ్​, ఉనా, జఫ్రాబాద్​, మహువాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.

అనంతరం అహ్మదాబాద్‌లో సమీక్షా సమావేశం కూడా నిర్వహిస్తారని ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలపింది.

ABOUT THE AUTHOR

...view details