తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైతులకు శుభవార్త- రేపు బ్యాంకు ఖాతాల్లో నగదు జమ!

పీఎం కిసాన్​ పథకం నిధులను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. 9.5 కోట్ల రైతు కుటుంబాలకు రూ.19వేల కోట్లు అందనున్నాయి.

pm kisan 8th installment, పీఎం కిసాన్​
పీఎం కిసాన్

By

Published : May 13, 2021, 2:03 PM IST

Updated : May 13, 2021, 2:30 PM IST

ప్రధాన మంత్రి కిసాన్​ సమ్మాన్​ నిధి (పీఎం-కిసాన్​) పథకానికి సంబంధించి 8వ విడత కింద నిధులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం గురువారం వెల్లడించింది.

ఈ ఎనిమిదో విడత ద్వారా లబ్ధిదారులైన 9.5 కోట్ల మంది కర్షక కుటుంబాలకు రూ.19000 కోట్లు లబ్ధి చేకూరుతుందని ప్రధాని మంత్రి కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. ఈ నిధులను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్​ చేస్తామని.. ఇప్పటివరకు రూ.1.15 లక్షల కోట్లను రైతు కుటుంబాలకు అందించామని తెలిపింది.

ఈ పథకం కింద కేంద్రం.. ఏటా రైతు కుటుంబాలకు రూ.6000ను.. మూడు విడతల్లో రూ.2000 చొప్పున అందిస్తోంది.

ఇదీ చదవండి :తల్లి, సోదరుడి మృతదేహాలతో 3 రోజులుగా ఇంట్లోనే మహిళ!

Last Updated : May 13, 2021, 2:30 PM IST

ABOUT THE AUTHOR

...view details