కొవిడ్ కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే నెలలో జరగనున్న భారత్-ఈయూ సదస్సు కోసం పోర్చుగల్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెళ్లటం లేదు. ఈ సదస్సు వర్చువల్‌గా జరగుతుందని అధికారులు తెలిపారు. ఈయూ(ఐరోపా సమాఖ్య), పోర్చుగీస్ నాయకత్వాన్ని సంప్రదించిన అనంతరం.. మే 8న జరిగే ఈ సదస్సును వర్చువల్ పద్ధతిలో నిర్వహించేందుకు అంగీకరించారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
"కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నందున భారత్-ఈయూ సదస్సును వర్చువల్‌గా నిర్వహించాలని ఈయూ, పోర్చుగల్ అధికారులను సంప్రదించగా.. వారు అందుకు అంగీకరించారు."
- అరిందమ్ బాగ్చి, విదేశాంగ శాఖ ప్రతినిధి