తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'జీ-7 సమావేశానికి వర్చువల్​గానే మోదీ!' - జీ-7 కూటమి

దేశంలో కరోనా విజృంభణ దృష్ట్యా జీ-7 సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యక్షంగా హాజరు కారని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వచ్చే నెలలో యూకేలోని కార్న్​వాల్​లో జీ-7 సమావేశం జరగనుంది.

pm modi
ప్రధాని నరేంద్ర మోదీ

By

Published : May 11, 2021, 9:22 PM IST

యూకేలోని కార్న్​వాల్​లో వచ్చే నెలలో జరగనున్న జీ-7 సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రత్యక్షంగా హాజరు కారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో కరోనా పరిస్థితుల దృష్ట్యా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

"జీ-7 సదస్సుకు ముఖ్య అతిథిగా భారత​ ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. భారత్​లో కరోనా పరిస్థితుల దృష్ట్యా జీ-7 సదస్సుకు ప్రత్యక్షంగా హాజరు కావద్దని ప్రధాని మోదీ నిర్ణయించారు."

-- అరిందమ్ బాగ్చీ, విదేశాంగ శాఖ ప్రతినిధి

జీ-7 కూటమిలో యూకే, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, అమెరికా సభ్య దేశాలుగా ఉన్నాయి.

ఇదీ చదవండి :'మీ అమ్మకు చెప్పు.. ఏదో ఒక రోజు సీఎం అవుతా'

ABOUT THE AUTHOR

...view details