తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మధురై మీనాక్షి​ ఆలయంలో మోదీ పూజలు

తమిళనాడు మధురైలోని మీనాక్షి అమ్మాన్​ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. శుక్రవారం మధురై, కన్యాకుమారిల్లో ఎన్​డీఏ నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.

PM modi visits madurai meenakshi amman temple
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

By

Published : Apr 2, 2021, 4:56 AM IST

తమిళనాడు పర్యటనలో భాగంగా మధురై మీనాక్షి అమ్మాన్​ ఆలయాన్ని సందర్శించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సందర్శన సందర్భంగా.. సంప్రదాయ దుస్తులు దోతి, చొక్కా ధరించారు మోదీ. పూర్ణకుంభంతో ప్రధానిని స్వాగతించారు ఆలయ వేదపండితులు.

మధురై మీనాక్షి అమ్మాన్​ ఆలయంలో మోదీ పూజలు

ఈ మేరకు మోదీ చిత్రాలను ట్విట్టర్​లో పంచుకుంది తమిళనాడు భాజపా. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ఎన్​డీఏ ఆధ్వర్యంలో ఎన్నికల ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. రోడ్డు మార్గం ద్వారా దేవాలయానికి చేరుకున్నట్లు తెలిపింది.

ఆలయంలో ప్రధాని మోదీ

ఎన్​డీఏ అభ్యర్థుల తరఫున మధురై, కన్యాకుమారిలో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొంటారు మోదీ.

మీనాక్షి ఆలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

తమిళనాడు అసెంబ్లీలోని 234 స్థానాలకు ఏప్రిల్​ 6న ఎన్నికలు జరగనుంది. అధికార ఏఐఏడీఎంకే భాగస్వామ్యంతో బరిలో నిలుస్తోంది భాజపా. అలాగే.. కన్యాకుమారి లోక్​సభ ఉప ఎన్నికల్లో భాజపా పోటీ చేస్తోంది. ఈ స్థానంలో కేంద్ర మాజీ మంత్రి పోన్​ రాధక్రిష్ణన్​ బరిలో నిలిచారు.

ఇదీ చూడండి:ఎన్నికల కోసం బ్రహ్మచర్యానికి బై.. పెళ్లికి సై!

ABOUT THE AUTHOR

...view details