PM Modi Visit Kanha Shanti Vanam : విశ్వంలో భారతదేశం గొప్ప జ్ఞాన భాండాగారంగా అవతరించిందని.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. కరోనా నేపథ్యంలో భారత్.. మన మిత్ర దేశమని యావత్ ప్రపంచం కొనియాడుతోందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో భారతదేశం.. విశ్వ మిత్ర దేశంగా ఎదగడం గర్వకారణం అని తెలిపారు. 3 రోజుల ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్లో ఉన్న ప్రధాని మోదీ.. ఇవాళ ఉదయం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరులోని ప్రఖ్యాత కన్హా శాంతి వనం ప్రధాని మోదీ సందర్శించారు.
ఈ ఎన్నికల్లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే - సీఎం అయ్యేది బీసీ వ్యక్తినే : ప్రధాని మోదీ
PM Modi Telangana Tour Today :ప్రధాని మోదీకి ప్రపంచ ధ్యాన గురువు కమలేశ్ డి పటేల్ - దాజీ, హార్ట్‌ఫుల్‌నెస్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధులు, విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. శ్రీరామచంద్ర మిషన్ వ్యవస్థాపకులు.. బాబూజీ మహారాజ్ 125వ జయంతి పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మోదీ.. శ్రీరామచంద్ర మిషన్ (హార్ట్‌ఫుల్‌నెస్ ఇన్‌స్టిట్యూట్) బాబూజీ మహారాజ్ స్మారక ఫలకం ఆవిష్కరించారు. సువిశాల ధ్యాన మందిరం వేదికపైకి చేరుకున్న సమయంలో మోదీకి కరతాళ ధ్వనుల మధ్య విద్యార్థులు, అభ్యాసీలు స్వాగతం పలికారు.
ధ్యాన అభ్యాసీలకు ప్రధాని అభివాదం చేసి ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా శ్రీరామచంద్ర మిషన్ (హార్ట్‌ఫుల్‌నెస్ ఇన్‌స్టిట్యూట్) బాబూజీ మహారాజ్ స్మారక ఫలకం ఆవిష్కరించారు. హార్ట్‌పుల్‌నెస్ ట్రస్ట్ కేంద్రం సేవలు అత్యంత స్ఫూర్తిదాయమని.. శ్రీరామచంద్ర మిషన్ అధ్యక్షుడు కమలేష్ డి పటేల్ సేవలకు గుర్తింపుగా పద్మ పురస్కారం ఇచ్చి కేంద్రం గౌరవించిందని ప్రధాని మోదీ అన్నారు.