Modi Varanasi visit: కాశీ విశ్వనాథ్ నడవా ప్రారంభోత్సవానికి ఉత్తర్‌ప్రదేశ్ వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీకి ప్రజలు ఘనస్వాగతం పలికారు. తన సొంత నియోజకవర్గం వారణాసిలో భారీగా జనం తరలివచ్చారు. దారి పొడవునా మోదీ కారుపై పూల వర్షం కురిపించారు. ప్రజలకు అభివాదం చేసుకుంటూ వెళ్లారు ప్రధాని.
ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అంతకుముందు.. విమానాశ్రయంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా ఇతర ఉన్నతాధికారులు మోదీకి స్వాగతం పలికారు.
కాలభైరవ ఆలయంలో పూజలు చేస్తున్న ప్రధాని మోదీ కాలభైరవ ఆలయంలో పూజలు నిర్వహించిన ప్రధాని.. హారతి సమర్పించారు.
Kashi Vishwanath Corridor inaugurate
రూ.339 కోట్లతో పూర్తయిన కాశీ విశ్వనాథ్ నడవా తొలి దశ పనులను మోదీ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో వివిధ మఠాలకు చెందిన 3 వేల మంది సాధువులు, మత పెద్దలు. కళాకారులు, పురప్రముఖులతో పాటు భాజపా పాలిత 12 రాష్ట్రాల సీఎంలూ పాల్గొంటారు. నడవాను ప్రారంభించిన తర్వాత గంగానదిలో విహార నౌకపై ఆ సీఎంలతో మోదీ సమావేశం అవుతారు. గంగా హారతిని కూడా నౌక నుంచే వీక్షిస్తారు.
వారణాసి ఎంపీగా ఈ మెగా కారిడార్ పనులకు 2019 మార్చి 8న మోదీ శంకుస్థాపన చేశారు.
ఇదీ చూడండి:పార్లమెంట్‌పై దాడికి 20 ఏళ్లు.. మృతులకు రాష్ట్రపతి, ప్రధాని నివాళి