వ్యవసాయ చట్టాలు రైతులకు ఎలా ఉపయోగపడతాయో తెలియజేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన 'ఈ బుక్లెట్' లను చదవాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఈ సాగు చట్టాల ప్రయోజనాలు, వీటి ద్వారా లబ్ధి పొందిన రైతుల విజయగాథలను పేర్కొంటూ కేంద్రం ఈ-బుక్లెట్లు విడుదల చేసింది. ఆంగ్లం, హిందీ భాషల్లో ఇవి లభ్యమవుతాయని.. అందరూ వీటిని చదివి షేర్ చేయాలని మోదీ ట్వీట్ చేశారు.
"ఇటీవలే అమలు చేసిన వ్యవసాయ చట్టాలు రైతులకు ఎలా ఉపయోగపడతాయో అనే దానిపై ఈ-బుక్లెట్లలో పూర్తి వివరణ ఉంది. నమో యాప్‌లోనూ మీరు వీటిని చూడవచ్చు. అవి చదివి అందరికీ షేర్ చేయండి".