PM Modi UP Election: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలతో రాజకీయం వేడి పుట్టిస్తోంది. కన్నౌజ్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ విపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. యూపీలో తొలివిడత పోలింగ్ పూర్తయిన తర్వాత వారసత్వ పార్టీల నేతలకు నిద్రకరవైందన్నారు. వారు కలలు కూడా కనలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. దేశంలో కుటుంబ పార్టీలే ప్రజాస్వామ్య స్ఫూర్తిని మార్చేశాయని మండిపడ్డారు. అలాంటి నేతలకు ప్రజాస్వామ్యమంటే.. ప్రజల చేత, ప్రజల కొరకు ఏర్పాటైన ప్రభుత్వం కాదనీ; కుటుంబం చేత కుటుంబం కొరకు ఏర్పాటైన ప్రభుత్వం అంటూ ప్రధాని చురకలంటించారు. అల్లర్లు, మాఫియా శక్తుల ఆటకట్టించేది భాజపా ప్రభుత్వమేనని ప్రజలు గమనించారన్నారు.
"ఈ ఎన్నికల్లో యూపీలో ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు? ఎవరు కాదు అనేది చర్చ కాదు. భాజపానే వస్తుందని రాష్ట్రమంతా తెలుసు. యోగి సీఎం అవుతారని దేశమంతా తెలుసు. గతంలో కన్నా ఎన్ని సీట్ల మెజార్టీతో భాజపా ప్రభుత్వం ఏర్పాటవుతుందనేందుకే ఈ పోటీ జరుగుతోందన్నారు. రెండు రోజుల నుంచి ప్రతిపక్ష నేతలు నిద్రపోవడంలేదు. కులతత్వాన్ని పెంచి, మతతత్వాన్ని ప్రచారం చేసి ఓట్లను చీల్చాలని చూస్తున్నారు. కానీ, మాఫియాలు, అల్లరి మూకలకు వ్యతిరేకంగా యూపీ ప్రజలు ఐక్యంగా ఓటు వేయడం నాకెంతో సంతోషంగా ఉంది." అన్నారు మోదీ.
ఓటర్లకు అర్థమైంది..