తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆ పార్టీలకు ఇప్పటికీ మాఫియాతో లింకులు!' - మోదీ ఉత్తర్​ప్రదేశ్

PM Modi UP campaign: ఉత్తర్​ప్రదేశ్​లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. విపక్షాలను రాజవంశాలుగా అభివర్ణించిన ఆయన.. ఆ పార్టీలు ఇంకా పాత రాజకీయాలే చేస్తున్నాయని అన్నారు.

PM Modi UP campaign
PM Modi UP campaign

By

Published : Mar 3, 2022, 4:56 PM IST

PM Modi UP campaign: ఉత్తర్​ప్రదేశ్​లోని పార్టీలు ఇంకా పాత రాజకీయాల్లోనే ఇరుక్కున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. మాఫియాతో సంబంధాలు పెట్టుకొని పనిచేస్తున్నాయని ఆరోపించారు. విపక్షాలను రాజవంశాలుగా అభివర్ణించారు. రాష్ట్రంలోని చందౌలీలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన.. విపక్షాలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తే.. భాజపా మాత్రం 'సబ్​కా సాత్ సబ్​కా వికాస్' సూత్రంతో పనిచేసిందని అన్నారు.

భాజపా ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితం కాలేదని మోదీ అన్నారు. పథకాలన్నీ లబ్ధిదారులకు చేరుకునేలా పనిచేసిందని చెప్పారు. భాజపా కూటమి చందౌలీ ప్రజల పక్షానే ఉందని అన్నారు.

ఇదీ చదవండి:రష్యా- ఉక్రెయిన్​ యుద్ధం.. క్వాడ్​ నేతలతో మోదీ కీలక భేటీ

ABOUT THE AUTHOR

...view details