తెలంగాణ

telangana

ETV Bharat / bharat

PM Modi twitter: ప్రధాని మోదీ ట్విటర్‌ ఖాతా హ్యాక్‌ - ప్రధాని మంత్రి కార్యాలయం ట్వీట్​

PM Modi twitter: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత ట్విట్టర్‌ ఖాతా హ్యాక్‌ అయింది. అయితే కొంతసేపటి తర్వాత ట్విట్టర్‌ యాజమాన్యం దాన్ని పునరుద్ధరించింది.

PM Modi twitter
ప్రధాని మోదీ ట్విట్టర్​

By

Published : Dec 12, 2021, 6:34 AM IST

PM Modi twitter: ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత ట్విట్టర్‌ ఖాతా హ్యాక్‌ అయింది. అయితే కొంతసేపటి తర్వాత ట్విట్టర్‌ యాజమాన్యం దాన్ని పునరుద్ధరించింది.

మోదీ వ్యక్తిగత ట్విట్టర్‌ ఖాతాలో అగంతుకులు బిట్‌కాయిన్‌ను ప్రమోట్‌ చేస్తూ పోస్టు చేశారు. భారత్‌లో బిట్‌కాయిన్‌ను లీగల్‌ చేశారని, ప్రభుత్వం 500 బిట్‌కాయిన్‌లు కొనుగోలు చేసి, ప్రజలకు పంచుతోందని లింక్‌లు ట్వీట్ చేశారు. దీంతో వెంటనే పీఎంఓ అధికారులు స్పందించి ట్విట్టర్‌ దృష్టికి తీసుకెళ్లడంతో ట్విట్టర్‌ ఖాతాను పునరుద్ధరించారు.

ప్రధాని మంత్రి కార్యాలయం ట్వీట్​

ఈ సంఘటన ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

ఇదీ చూడండి:Chopper crash: మృతదేహాల గుర్తింపు ప్రక్రియ పూర్తి

ABOUT THE AUTHOR

...view details