PM Modi tweet on Telangana Assembly Elections : రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం మొదలయింది. ప్రతి ఓటరు ఓటు వేసేందుకు ముందుకు రావాలని.. ఆలోచించి నాయకుణ్ని ఎన్నుకోవాలని ప్రముఖులు సూచిస్తున్నారు. గతం కంటే ఎక్కువ ఓటింగ్ శాతం వచ్చేలా ప్రోత్సహిస్తున్నారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ.. పోలింగ్ కేంద్రానికి వెళ్లి వేలికి సిరా మార్కు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. తదితర నాయకులు ఓటు వేయాలని వారి ఎక్స్(ట్వీటర్)లో ప్రజలకు సందేశాన్నిచ్చారు.
PM Modi Tweet on Telangana polling 2023: 'తెలంగాణలోని నా సోదర సోదరీమణులు రికార్డు స్థాయిలో ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని నేను పిలుపునిస్తున్నాను. యువకులు మరీ ముఖ్యంగా మొదటిసారిగా ఓటు వేస్తున్నవారు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నానని' నరేంద్ర మోదీ ట్వీట్ (Narendra Modi Tweet)చేశారు.
ఓటు వేసేందుకు క్యూ ఎంత ఉంది - ఎంత సమయం పడుతుందో తెలుసుకోవచ్చు : సీఈఓ వికాస్‌రాజ్
Rahul Gandhi Tweet on Telangana polling 2023: 'నేడు దొరలపై ప్రజలు గెలవబోతున్నారు. నా తెలంగాణ సోదర సోదరీమణులారా! రండి.. అధిక సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనండి. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ఓటేయ్యండి! కాంగ్రెస్‌ను గెలిపించండి!' - రాహుల్ గాంధీ, ఏఐసీసీ అగ్రనేత
Priyanka Gandhi Tweet on Telangana polling 2023: 'నా తెలంగాణ సోదర సోదరీమణులారా.. మా తల్లులారా.. పిల్లలారా మీరు బాగా ఆలోచించి పూర్తి ఉత్సాహంతో, శక్తితో ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఓటు వేయడం మీ హక్కు, అది మీ అతిపెద్ద బాధ్యత. ఓటు బలంతో ప్రజల తెలంగాణ కలను సాకారం చేసి చూపండి. అభినందనలు జై తెలంగాణ జై హింద్' అని ప్రియాంక గాంధీ ట్వీట్(Priyanka Gandhi Tweet) చేశారు.