ప్రధాని నరేంద్ర మోదీ 71వ జన్మదినం (Modi birthday) సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు (Modi birthday wishes) తెలిపారు. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. మోదీ దేశం కోసం అహర్నిశలు సేవ చేస్తూనే ఉంటారని కొనియాడుతూ ట్వీట్ చేశారు. అసాధారణమైన దృష్టి, ఆదర్శప్రాయమైన నాయకత్వం కలిగిన ప్రధానికి శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ప్రధాని అంకితభావంతో దేశం సర్వతోముఖాభివృద్ధి చెందుతోందని ప్రశంసించారు.
ఉపరాష్ట్రపతి ట్వీట్, pm modi మోదీకి శుభాకాంక్షలు (Modi birthday wishes) తెలిపిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ప్రధాని అంకితభావం దేశ ప్రజలకు కొత్త శక్తిని, విశ్వాసాన్ని ఇచ్చిందని ట్వీట్ చేశారు. అభివృద్ధిలో మోదీ.. ఎన్నో నూతన అధ్యాయాలు లిఖించారని, ఆయన మంచి పాలన అందిస్తున్నారని అన్నారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.
ఇంకా కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతలు మోదీకి జన్మదిన శుభాకాంక్షలు (Modi birthday wishes) తెలిపారు.
''హ్యాపీ బర్త్ డే మోదీజీ'' అని ట్వీట్ చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.
టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా కూడా మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.
''మీ పుట్టినరోజు సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇలాగే సుఖసంతోషాలతో ఎక్కువ కాలం జీవించాలి. కొవిడ్-19 మహమ్మారి వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ.. ప్రజల్లో విశ్వాసం నింపడం నిజంగా గొప్ప విషయం.''
- దలైలామా, టిబెట్ ఆధ్యాత్మిక గురువు
వేడుకలు విభిన్నంగా..
ప్రధాని జన్మదిన వేడుకలను (Modi birthday) దేశవ్యాప్తంగా భారీ ఎత్తున నిర్వహించేందుకు భాజపా సన్నద్ధమైంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం ప్రధానిగా మోదీ 20 ఏళ్ల ప్రజాసేవకు నిదర్శనంగా సేవా సమర్పణ్ పేరిట నేటి నుంచి అక్టోబర్ 7 వరకు 20 రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపట్టనుంది. మోదీ జన్మదినం సందర్భంగా వ్యాక్సిన్ సేవ పేరిట దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను.. నేడు భారీగా చేపట్టాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ పిలుపునిచ్చారు. ప్రధాని సేవలను అభినందిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న భాజపా బూత్‌ల నుంచి మోదీకి 5 కోట్ల పోస్టుకార్డులు పంపనున్నట్లు పేర్కొన్నారు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.
సీఎం నుంచి పీఎం వరకు..
1950 సెప్టెంబర్ 17న గుజరాత్లో జన్మించారు మోదీ. చిన్న వయసులోనే హిందుత్వ సంస్థ.. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో(ఆర్ఎస్ఎస్) చేరారు. ఆ తర్వాత రాజకీయాల పట్ల ఆకర్షితులై.. అంచెలంచెలుగా ఎదిగారు.
2001లో తొలిసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ఎన్నికయ్యారు. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. 2014 వరకు ఆయనే సీఎంగా కొనసాగారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో భాజపాకు రికార్డు విజయం అందించి.. ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2019లో మరోసారి ప్రధానిగా ఎన్నికయ్యారు.
ఇవీ చూడండి:Modi birthday: ప్రధాని బర్త్‌డే.. వ్యాక్సినేషన్లో ఆ రికార్డు కోసం..!
PM Gift Auction: వేలానికి మోదీ స్వీకరించిన కానుకలు, మెమెంటోలు