తెలంగాణ

telangana

ETV Bharat / bharat

PM Modi Today Speech : 'విపక్షాల కళ్లు మూసుకుపోయాయ్​.. 'ఇండియా' కూటమికి త్వరలోనే 'తాళం''

పార్లమెంట్​లో ప్రధాని మోదీ ప్రసంగం
pm modi today speech in parliament

By

Published : Aug 10, 2023, 3:50 PM IST

Updated : Aug 10, 2023, 7:52 PM IST

19:28 August 10

  • లోక్‌సభలో వీగిన విపక్షాల అవిశ్వాస తీర్మానం
  • మూజువాణి ఓటుతో వీగిన విపక్షాల అవిశ్వాస తీర్మానం
  • ఓటింగ్‌కు ముందే సభ నుంచి వాకౌట్ చేసిన విపక్షాలు
  • లోక్‌సభ రేపటికి వాయిదా

19:23 August 10

  • భారత ఆత్మవిశ్వాసాన్ని, అభివృద్ధిని ప్రపంచం గుర్తించింది.. ఇది భారతీయ ప్రజల విజయం
  • నాపై ఎన్ని విమర్శలు చేసినా.. ఎన్ని అసందర్భ ప్రేలాపనలు చేసినా నన్ను గాయపర్చలేవు
  • వ్యక్తిగా నన్ను అవమానపర్చాలనుకుంటే అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నా
  • మణిపుర్‌లో జరిగింది అమానవీయం.. దాన్ని రాజకీయం చేయడం తగదు
  • మరో ఘటన జరగకుండా అందరం కలిసి నిబద్ధతతో పనిచేస్తేనే దేశం ముందడుగు వేస్తుంది
  • మణిపుర్‌ అంశం ముందుపెట్టి అవిశ్వాసం ప్రకటించారు.. అది మేము చేసిన పని చెప్పుకునే అవకాశం కల్పించింది
  • మరోసారి జాతి ప్రయోజనాలు పణంగా పెట్టే అవిశ్వాసాలు రావని భావిస్తున్నాం

19:19 August 10

  • 2018 తర్వాత 2023లో అవిశ్వాసం పెట్టారు.. కనీసం పెట్టేదైనా సరిగ్గా పెట్టవచ్చు కదా
  • అవిశ్వాసానికి ఎందుకు పెడుతున్నారనేదానికి స్పష్టత లేదు.. సంసిద్ధత లేదు
  • మరోసారి అవిశ్వాసం పెట్టినప్పుడైనా సంపూర్ణమైన సంసిద్ధతతో వస్తారని ఆశిస్తున్నా
  • సభ ప్రజల సొమ్ముతో నడుస్తోంది.. ప్రతిక్షణం అత్యంత విలువైనది
  • ప్రజల ధనాన్ని.. సభా సమయాన్ని దుర్వినియోగం చేయకూడదు
  • రాజకీయాలు బయట చేయాలి.. సభలో కాదు
  • దేశ అభివృద్ధి, సమగ్రత కోసం సభలో చర్చలు జరగాలి
  • దేశ అభివృద్ధి, సమాజ సేవ కోసం ఆత్మబలిదానానికి కూడా వెనుకాడని వారసత్వం నుంచి మేము వచ్చాం
  • వ్యక్తుల కన్నా దేశానికే తొలి ప్రాధాన్యమనేది మా ఆలోచన విధానం
  • నేటి భారతం ఒత్తిళ్లకు తలొగ్గదు.. సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తోంది

19:12 August 10

  • కాలం మారింది.. ఈశాన్య రాష్ట్రాలు దేశానికి కొత్త ఆర్థిక వ్యవస్థలుగా మారుతున్నాయి
  • ఆగ్నేయ ఆసియాతో భారత్‌ అనుసంధానానికి పట్టుకొమ్మలు ఈశాన్య రాష్ట్రాలు
  • ఈశాన్య రాష్ట్రాల్లో నూతన రహదారులు, రైల్వే వ్యవస్థ, విమానాశ్రయాలు వస్తున్న విషయం కనబడట్లేదా?
  • భారతీయ రైల్వే వ్యవస్థతో మణిపుర్‌ అనుసంధానమైన విషయం మీకు కనబడట్లేదా?
  • ఈశాన్య రాష్ట్రాల ప్రజలను ఎన్డీఏ ప్రభుత్వం ఎలా గౌరవిస్తోందో మీకు గుర్తు రావట్లేదా?
  • కాంగ్రెస్‌ వాళ్లు మణిపుర్‌, నాగాలాండ్‌, మిజోరాంలో జరుగుతున్న అభివృద్ధి చూడలేకపోతున్నారా?
  • మా సమయం, శ్రమ సంపూర్ణంగా దేశం కోసమే.. ప్రతిక్షణం మా ఆలోచన, వివేచన దేశాభివృద్ధి కోసమే
  • అబద్ధాలు చెప్పాల్సిన అవసరం మాకు లేదు.. మీరు కళ్లు తెరిచి చూడండి అభివృద్ధి ఏంటో కనబడుతుంది

19:09 August 10

  • విభజన రాజకీయాలతో ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ నిరంతరం మంటలు రేపింది
  • ఈశాన్య రాష్ట్రాల్లో ఇష్టానుసారం ప్రభుత్వాలను మార్చడం, సీఎంలను మార్చడం అనేక సమస్యలను సృష్టించింది
  • మహాత్మాగాంధీ ఫొటో పెట్టలేని పరిస్థితి కాంగ్రెస్‌కు గుర్తుండే ఉంటుంది
  • మణిపుర్‌లో జాతీయగీతం పాడలేని పరిస్థితులు ఉండేవి
  • ఈ పరిణామాలు ఉన్నప్పుడు ప్రభుత్వాలు నడిపింది కాంగ్రెస్‌ కాదా
  • మణిపుర్‌లో సాయంత్రం 4 తర్వాత ఆలయాలు మూసి సైన్యం పహారా కాసేది.. అది కాంగ్రెస్‌కు గుర్తు లేదా?
  • మణిపుర్‌ తీవ్రవాదానికి కారణం ఎవరో.. కారకులు ఎవరో కాంగ్రెస్‌కు గుర్తులేదా?
  • కాంగ్రెస్‌కు రాజకీయాలు తప్ప.. ప్రజల బాగోగులు పట్టించుకున్న సందర్భమేమైనా ఉందా
  • కాంగ్రెస్‌ ప్రభుత్వాల్లో నిరంతర బంద్‌లు, బ్లాకేడ్‌లు జరిగిన సందర్భాలు విపక్షాలు మరిచిపోయాయా
  • రోజుల తరబడి రహదారులను దిగ్బంధం చేసిన కాలాన్ని విపక్షాలు మరిచిపోయాయా.. అప్పుడు అధికారంలో ఉంది ఎవరు
  • మణిపుర్‌లో తీవ్రవాదం పరాకాష్టకు చేరినపుడు అధికారంలో ఉంది ఎవరు

19:04 August 10

  • లోహియా శిష్యులమని చెప్పుకునేవాళ్లకు.. లోహియా ఏం చెప్పారో మీకు గుర్తుందా
  • ఈశాన్య భారతాన్ని ఉద్దేశపూర్వకంగా నెహ్రూ అభివృద్ధి చేయట్లేదని ఆరోపించారు
  • 30 వేల చదరపు మైళ్ల ప్రాంతాన్ని అభివృద్ధికి దూరంగా ఉంచారని నెహ్రూపై ఆరోపణలు చేశారు
  • లోహియా చేసిన ఆరోపణలు .. లోహియా అనుచరులమని చెప్పుకునేవాళ్లకు గుర్తున్నాయా?
  • ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి ఎప్పుడు ప్రారంభమైంది.. దానికి కారకులెవరని మీరెప్పుడైనా గ్రహించారా
  • ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై కాంగ్రెస్‌ ఎప్పుడైనా చిత్తశుద్ధితో పనిచేసిందా
  • కాంగ్రెస్‌ పార్టీ, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఈశాన్య రాష్ట్రాలను ఎప్పుడైనా అక్కున చేర్చుకున్నాయా?
  • తొమ్మిదేళ్ల నుంచి మేము చేస్తున్న అభివృద్ధి అనుభవంతో చెబుతున్నా.. ఈశాన్య రాష్ట్రాలు మాకు అత్యంత ప్రాధాన్యమైనవి
  • ఈశాన్య రాష్ట్రాల సమస్యలన్నింటికీ కాంగ్రెస్సే మూల కారణం
  • కాంగ్రెస్‌ చేసిన కుటిర రాజకీయాలే ఈశాన్య రాష్ట్రాల్లో నిరంతర సమస్యలకు కారణమయ్యాయి

18:58 August 10

ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై వాడీవేడిగా చర్చ కొనసాగుతోంది. అవిశ్వాసంపై ప్రధాని మోదీ లోక్‌సభలో సమాధానమిస్తున్నారు. కాంగ్రెస్‌ సహా విపక్షాలను ఎండగడుతున్నారు. ఈ నేపథ్యంలో విపక్షాలు లోక్‌సభ నుంచి వాకౌట్‌ చేశాయి. ప్రధాని మాట్లాడుతుండగానే ఇండియా కూటమి ఎంపీలు లోక్‌సభ నుంచి బయటకి వెళ్లిపోయారు.

18:57 August 10

  • దేశాన్ని ఏకీకృతం చేయాల్సిన బాధ్యత ఏనాడు తీసుకోలేదు
  • ఓట్ల రాజకీయాల కోసం దేశాన్ని కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో విభజన చేశారు
  • కాంగ్రెస్‌ చరిత్ర అంతా భరతమాతను చిన్నాభిన్నం చేయడంలోనే మునిగిపోయింది
  • ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టారు
  • ఓట్లు, రాజకీయాల కోసం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడమే కాంగ్రెస్‌కు అలవాటుగా మారింది
  • భారత్‌లో కాంగ్రెస్‌ అరాచకాలు చెప్పుకుంటే అనేకం
  • మిజోరాం మీద జరిగిన వాయుసేన దాడి మర్చిపోయినట్లున్నారు
  • మార్చి 5న ఇప్పటికీ మిజోరాం.. నిరసన దినంగా భావిస్తుంది
  • ఇందిరా హయాంలో మిజోరాంపై జరిగిన వాయుసేన దాడిని కాంగ్రెస్‌ ఇప్పటిదాకా దాచిపెట్టింది
  • ఆరోజు మిజోరాం ప్రజలపై జరిగిన దాడి గాయం ఇప్పటికీ మానలేదు

18:52 August 10

  • భారతమాత పట్ల ప్రతిపక్ష సభ్యులు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా
  • అధికారం లేకుండా విపక్షాలు జీవించలేవు.. అధికారం కోసమే విపక్షాల ప్రయాసంతా
  • భారతమాత మరణం గురించి మాట్లాడటమంటే దేశ వినాశనాన్ని కోరుకున్నట్లే
  • ఒకసారి భారతమాత హత్య అంటారు.. మరోసారి రాజ్యాంగం హత్య అంటారు.. ఎలాంటి భాష ఇది
  • ఇది ఇవాళ కొత్తగా వచ్చిన సంస్కారం కాదు.. వందేమాతరాన్ని ముక్కలుముక్కలుగా చేసిననాడే వీళ్ల ఉద్దేశాలు బయటపడ్డాయి
  • బుజ్జగింపు విధానాలతోనే దేశానికి ముప్పు తెచ్చిపెట్టారు

18:46 August 10

  • మణిపుర్‌పై సంపూర్ణ చర్చ జరగాలనే ఆలోచన విపక్షాలకు లేదు
  • మణిపుర్‌లో ఏం జరిగిందో నిన్న అమిత్‌షా వివరంగా చెప్పారు
  • మణిపుర్‌లో జరిగింది మళ్లీ జరగకుండా అందరం కలిసి ఒక నిర్ణయానికి రావాలనే ఆలోచన విపక్షాలకు లేదు
  • మణిపుర్‌ పరిణామాలపై హోంమంత్రి నిన్న రాజకీయాలతో సంబంధం లేకుండా 2 గంటలపాటు వివరించారు
  • ఈ పరిణామాలన్నింటిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు
  • మణిపుర్‌ ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన బాధ్యత గురించి అమిత్‌షా సవివరంగా సభ ముందుంచారు
  • విపక్షాలకు మణిపుర్‌ ప్రజలపై ప్రేమకన్నా.. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనే ఆలోచన ఎక్కువ
  • మణిపుర్‌లో విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి.. ప్రజల మధ్య పరస్పర విశ్వాసం నశించింది
  • మహిళలకు ఘోర అవమానం జరిగింది.. అది మనందరికీ తలవంపులే
  • మణిపుర్‌లో శాంతి నెలకొంటుందని సాధారణ పరిస్థితులు ఏర్పడుతాయని సంపూర్ణ విశ్వాసంతో సభకు హామీ ఇస్తున్నా
  • ఈ సభ, దేశం సంపూర్ణంగా మణిపుర్‌ ప్రజలకు అండగా నిలుస్తుంది
  • స్పర్ధలను వీడి మణిపుర్‌ తిరిగి అభివృద్ధి బాట పడుతుందన్న విశ్వాసం నేను సభకు ఇస్తున్నా

18:39 August 10

  • కాంగ్రెస్‌ వాళ్ల కష్టాలు చూసి మాకు కాస్త జాలి వేస్తోంది.. పనికి రాదనుకున్న వస్తువును మళ్లీ మళ్లీ లాంచ్‌ చేస్తున్నారు
  • పనికిరాని వస్తువును ఎన్నిసార్లు లాంచ్‌ చేసినా పబ్లిక్‌ పట్టించుకోరు
  • రాహుల్‌ను ఉద్దేశించి ప్రధాని మోదీ పరోక్ష వ్యాఖ్యలు
  • పబ్లిక్‌ పట్టించుకోకపోతే కాంగ్రెస్‌ జనాన్ని దోషులుగా చేస్తుంది
  • జనం మెచ్చని వస్తువులను ఎన్నిసార్లు లాంచ్‌ చేసినా ఆదరణ దొరకదు.. ఇప్పుడు చేసేది మరో విఫలయత్నం
  • రాజకుమారుడు కారు అద్దం దించి దేశంలో సమస్యలు ఇప్పుడిప్పుడే చూస్తున్నారు
  • ప్రజల కష్టాలు, నష్టాలు చూసి తీవ్ర ఆందోళనకు గురవుతున్నాడు
  • దేశాన్ని 50 ఏళ్లు పాలించింది ఆ రాజవంశమే అన్న స్పృహ ఆయనకు ఇంకా వచ్చినట్లు లేదు
  • ఇప్పడు ఏర్పాటు చేసిన INDIA దుకాణానికి కూడా త్వరలో తాళం పడుతుంది
  • అహంకారపూరిత సంకీర్ణం దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలని చూస్తోంది
  • ఈ సంకీర్ణం దేశ ఆర్థిక వ్యవస్థలను నష్టపరచాలని చూస్తోంది

18:34 August 10

  • లంకను తగులబెట్టింది హనుమంతుడు కాదు.. లంకేయుల అహంకారం
  • ఆ విషయం కాంగ్రెస్‌కు నూటికి నూరు శాతం సరిపోలుతుంది
  • 400 సీట్ల నుంచి 40 సీట్లకు వచ్చిన ఘనత కాంగ్రెస్‌దే
  • ఈ లంకా దహనం ఎవరు చేశారో వాళ్లే తేల్చుకోవాలి
  • ప్రధానమంత్రి మా వారసత్వ హక్కు.. ఎవరో వచ్చి ప్రధాని పదవిలో కూర్చుంటారా? అనే అహంకారం మిమ్మల్ని వీడట్లేదు
  • ఎదుటివాళ్లను గౌరవించే సంస్కారం కాంగ్రెస్‌కు లేదు.. రాదు కూడా
  • కాంగ్రెస్‌ వాళ్లు ఏం చేశారో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి
  • పుట్టినరోజు వేడుకలకు యుద్ధనౌకలు వాడుకున్నారు
  • చీరలకు డ్రైక్లీనింగ్‌ కోసం అధికారిక విమానాలను వినియోగించారు
  • హవాయి చెప్పులు వేసుకునే నిరుపేదలకు విమానం ఎక్కే అవకాశం దొరికింది.. మీరు పుట్టినరోజు వేడుకలు చేసుకున్న యుద్ధనౌకలు శరణార్ధుల రవాణాలో నిమగ్నమయ్యాయి
  • కాలం మారింది.. మీ ఆటలు సాగవు.. పేదలదే రాజ్యం.. నిరుపేదలదే అధికారం

18:25 August 10

  • అహంకారపూరిత సంకీర్ణం.. వారసత్వ పాలనకు ప్రతిబింబం
  • వారసత్వ రాజకీయాల సమాహారమే ఇండియా పేరుతో వచ్చిన కొత్త సంకీర్ణం
  • లోహియా, బోర్డొలోయ్‌, జేపీ, రాజేంద్రప్రసాద్‌ వంటి ఎందరో మహానుభావులు వారసత్వ రాజకీయాలు దేశానికి నష్టదాయకమని చెప్పారు
  • జాతి నిర్మాణంలో వారసత్వ రాజకీయాలు అడ్డంకిగా మారుతాయని తొలి తరం మేధావులు చెప్పిన విషయాన్ని కాంగ్రెస్‌ మర్చిపోయింది
  • వారసత్వ రాజకీయాలు చేసేవాళ్లకు దేశంలో కాలం చెల్లిపోయింది
  • కాంగ్రెస్‌ను వ్యతిరేకించిన మేధావులను కూడా ఆ పార్టీ ఓడించి చూపింది
  • కాంగ్రెస్‌ను ప్రశ్నించినందుకే అంబేడ్కర్‌ను రెండుసార్లు ఎన్నికల్లో ఓడించింది
  • ఎమర్జెన్సీని ప్రశ్నించినందుకు జగ్జీవన్‌రామ్‌ను ఓడించింది
  • జయప్రకాశ్‌ నారాయణ, మొరార్జీ దేశాయ్‌ వంటి ఎంతోమంది నాయకులను కాంగ్రెస్‌ నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసింది
  • తొలితరం నాయకులందరినీ కాంగ్రెస్‌ విస్మరించింది
  • కాంగ్రెసేతర ప్రభుత్వాలే తొలితరం మహానాయకులకు తగినంత గౌరవం కల్పించాయి
  • మాజీ ప్రధానులందరినీ గౌరవించిన ఘనత ఎన్డీఏదే
  • మాజీ ప్రధానులందరి కృషిని పీఎం మ్యూజియంతో ప్రజల ముందుంచుంది ఎన్డీఏ

18:24 August 10

  • ఇతరుల కష్టాన్ని, విజయాలను ఖాతాలో వేసుకోవడం కాంగ్రెస్‌కు వెన్నతో పెట్టిన విద్య.. 1920 నుంచి ఇదే కథ
  • మూడు రంగుల జాతీయ జెండాను.. కాంగ్రెస్‌ జెండాగా మార్చుకుంది
  • ఎన్నికల గుర్తులను కూడా ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వచ్చింది
  • ఇది ఇండియా సంకీర్ణం కాదు.. అహంకారపూరిత సంకీర్ణం
  • ఆ సంకీర్ణంలో ప్రతి ఒక్కరూ ప్రధాని కావాలనుకుంటారు
  • 21 రాష్ట్రాల్లో ఒక్కోచోట ఒక్కో రకంగా ఈ పార్టీల సంకీర్ణం ఉంటుంది
  • అక్కడ కలహించుకుంటారు.. ఇక్కడికి వచ్చి కలిసిపోతారు
  • కేరళ, బంగాల్‌లో కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు పరస్పరం దాడులు చేసుకుంటారు.. ఇక్కడికి వచ్చి చేతులు కలుపుతారు
  • మీ చర్యలు, మీ చేష్టలను దేశం గమనిస్తోంది
  • మీరు చేసే ప్రతి పనిని ప్రజలు గమనిస్తున్నారు

18:15 August 10

  • NDAకు రెండు Iలు అదనంగా చేర్చి INDIA పేరుతో మళ్లీ 16 పార్టీలు ఏకతాటిపైకి వచ్చాయి
  • ఎన్ని కొత్త జట్లు కట్టినా ఓటమి ఖాయం.. ఆ విషయం గుర్తుపెట్టుకోండి
  • INDIAలోని ఒక I.. 16 పార్టీల అహంకారానికి సూచిక.. మరొక I.. ఒక ప్రధాన కుటుంబ అహంకారానికి సూచిక
  • మీ కూటమిలోనే భారత్‌ అస్తిత్వాన్ని ప్రశ్నించే వాళ్లు ఉన్నారు.. అలాంటి వారితో మీ బండి ఎలా కదులుతుంది
  • ఒక పెద్ద పేరుతో దశాబ్దాలుగా దేశాన్ని పరిపాలిస్తున్నారు.. వారి పని ఎక్కడా కనిపించదు
  • ఆస్పత్రుల పేర్లు, క్రీడా అవార్డుల పేర్లు, రహదారుల పేర్లు అన్నింటికీ వారి పేర్లే
  • ఆస్పత్రులకు వారి పేరు ఉంటుంది కానీ చికిత్స దొరకదు
  • రహదారుల పేర్లు పెట్టుకుంటారు కానీ.. కొత్తవాటి నిర్మాణం ఆలోచించరు
  • వారి పేరుతో అవార్డులు ఉంటాయి కానీ.. క్రీడాకారులకు ప్రోత్సాహం ఉండదు
  • పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లు ఉంటుంది ఆ కుటుంబం వ్యవహార శైలి
  • ఆ కుటుంబం గురించి.. వాళ్ల అహంకారం గురించి చెప్పాలంటే చేంతాడంత ఉంది

18:06 August 10

  • రాష్ట్రాలవారీగా కాంగ్రెస్‌ చివరిసారిగా ఎప్పుడు గెలిచిందో సభ ముందుంచిన ప్రధాని
  • తమిళనాడు, బంగాల్‌, త్రిపుర, ఒడిశా, నాగాలాండ్‌ రాష్ట్రాల్లో దశాబ్దాలుగా కాంగ్రెస్‌ ఓడిపోతూనే ఉంది
  • ఆంధ్రప్రదేశ్‌, బంగాల్‌లో ఒక్క శాసనసభ్యుడు కూడా లేరు
  • బెంగళూరులో మీరు యూపీఏకు ఇటీవల కర్మకాండ నిర్వహించారు
  • కర్మకాండలను కూడా మీరు పండుగలాగా చేసుకుంటున్నారు
  • యూపీఏ అనేది ముగిసిన అధ్యాయం.. మూలనపడ్డ బండికి రంగు వేయడం లాంటిది
  • ఎన్ని రంగులు వేసినా.. పైపూతలు పూసినా బండి నడవదు
  • మిమ్మల్ని గెలిపించకపోవడం ప్రజల అపరాధం కాదు.. మీరు చేసుకున్న కర్మ

17:57 August 10

  • డిజిటల్ ఇండియా గురించి మాట్లాడినపుడు అవహేళన చేశారు.. జన్‌ధన్‌ గురించి మాట్లాడినపుడు అవహేళన చేశారు
  • డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థ ఏ స్థాయికి వెళ్లిందో మన కళ్లెదుటే కనబడుతోంది
  • విపక్షాలకు ఆత్మ విశ్వాసం ఉండదు.. దేశీయులను నమ్మరు
  • మన వ్యవస్థలకన్నా పాకిస్థాన్‌ చెప్పే మాటలపైనే విపక్షాలకు విశ్వాసం ఎక్కువ
  • భారతీయ సైన్యం కంటే పాకిస్థాన్‌పైనే విపక్షాలకు నమ్మకం ఎక్కువ
  • భారత్‌పై వచ్చే వ్యతిరేక ప్రచారానికే ప్రతిపక్షాలు ఎక్కువ విలువిస్తాయి
  • భారత్‌ సామర్థ్యం మీద.. భారత ప్రజల సామర్థ్యం మీద విపక్షాలకు విశ్వాసం లేదు
  • అహంకారంతో కాంగ్రెస్‌ కళ్లు మూసుకుపోయాయి.. వాస్తవికతను జీర్ణించుకునే పరిస్థితులో లేరు

17:50 August 10

  • ఒకసారి ప్రపంచంలో భారత ఆర్థిక వ్యవస్థ ఏ స్థాయికి ఎదుగుతుందో చూడండి
  • అతి త్వరలో భారత్‌ ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది
  • మేము తప్పులు చేస్తున్నామంటున్నారు కదా.. విపక్షాలు మీరేం చేస్తున్నారు.. మేము తప్పు చేస్తే సరైన దిశానిర్దేశం చేసే బాధ్యత విపక్షాలకు లేదా?
  • మేం చేసే పనుల్లో తప్పుఒప్పులుంటే సూచనలు సలహాలు ఇచ్చే బాధ్యత మీకు లేదా?
  • ఒక్కరోజైనా మీరు ఏం చేస్తున్నారు.. మీరు చేసే పనుల్లో మంచి చెడులేమైనా అడిగారా?
  • మేము ఏమీ చేయకుండానే మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఎదుగుతోందా?
  • కాంగ్రెస్‌కు ప్రపంచాన్ని అర్థం చేసుకునే ఆలోచన లేదు.. స్థాయి లేదు
  • కాంగ్రెస్‌కు ఆర్థిక వ్యవస్థ పట్ల.. దేశం పట్ల.. దిశదశ లేదు
  • ప్రతిదాన్ని విమర్శించడం తప్ప ఆలోచన విధానం లేదు
  • 1991లో భారత్‌.. అప్పుల కోసం ప్రపంచంవైపు చూసింది
  • 2014 తర్వాత భారత్‌ స్థిరమైన ఆర్థిక వ్యవస్థగా నిలదొక్కుకుంది
  • రిఫార్మ్‌, పెర్‌ఫామ్‌, ట్రాన్స్‌ఫామ్‌ అనే పద్ధతిలో దేశాన్ని ముందుకు నడిపిస్తున్నాం

17:43 August 10

  • హెచ్‌ఏఎల్‌ అస్తిత్వాన్ని ప్రశ్నించారు .. హెచ్‌ఏఎల్‌ మునిగింది.. రక్షణ పరిశ్రమలు నాశనమయ్యాయని అన్నారు
  • హెచ్‌ఏఎల్‌ మునిగిపోతోంది.. కార్మికులను భవిష్యత్తు లేదంటూ ఆందోళన చేశారు
  • ఇప్పుడు హెచ్‌ఏఎల్‌ ఎలా ఉందో తెలుసా మీకు?.. హెచ్‌ఏఎల్‌ చరిత్రలో అత్యధిక ఆదాయం నమోదు చేసింది
  • కార్మికులను రెచ్చగొట్టినా ఇవాళ హెచ్‌ఏఎల్‌ విజయపతాక ఎగురవేసింది
  • మూడో ఉదాహరణ ఎల్‌ఐసీ.. ఎల్‌ఐసీ మునిగిపోతోంది.. పేదల పెద్దలకు కట్టబెడుతున్నారంటూ ప్రచారం చేశారు
  • ఎల్‌ఐసీలోని పేదల సొమ్ముతో పెద్దలను కాపాడుతున్నారంటూ విషప్రచారం చేశారు
  • స్టాక్‌మార్కెట్‌లో ఎల్‌ఐసీ విలువ చూసి మాట్లాడండి
  • మీరు ఏవైతే మునిగిపోతున్నాయని అన్నారో అవి అద్భుత ఫలితాలిస్తున్నాయి
  • అసలు మీకు.. ప్రజల మీద, దేశం మీద, వ్యవస్థల మీద విశ్వాసం లేదు

17:41 August 10

  • మోదీకి సమాధి కట్టేస్తున్నారు.. మోదీకి సమాధి తవ్వుతున్నారంటూ అపభ్రంశాలు పలుకుతున్నారు
  • అమంగళం, అపభ్రంశాలతో మోదీని ఆపలేరు
  • విపక్షాలకు ఎదుటి వాళ్ల నష్టం కోరుకునే వరం లభించినట్లుంది
  • మీరు ఎంత నష్టం కోరుకుంటే మారు అంత లాభం జరుగుతోంది.. తొమ్మిదేళ్లలో ఇది పదేపదే నిరూపితమైంది
  • విపక్షాలు ఎప్పటికీ నిరాశ, నిస్పృహలు వెదజల్లుతుంటాయి.. మొదటి ఉదాహరణ బ్యాంకులు
  • బ్యాంకులు మునిగిపోతున్నాయి.. బ్యాంకులు నాశనం అవుతున్నాయని శాపనార్ధాలు పెట్టారు
  • బ్యాంకుల విషయంలో ఇప్పుడు ఏం జరిగింది?
  • భారతీయ బ్యాంకులన్నీ మరింత బలోపేతమై లాభాల బాట పట్టాయి.. విపక్షాల అది కనిపిస్తోందో? లేదో?

17:35 August 10

  • భారత్‌లో నిరుపేదలు, అతిపేదలు లేరని ఐఎంఎఫ్‌ పేర్కొంది
  • 37 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ఐఎంఎఫ్‌ అధికారికంగా చెప్పింది
  • శుభ్రత, పరిశుభ్రత విషయంలో భారత్‌ కృషిని డబ్ల్యూహెచ్‌వో ప్రశంసించింది
  • లక్షలాది మందిని అంటువ్యాధుల నుంచి రక్షించిన విషయాన్ని డబ్ల్యూహెచ్‌వో అధికారికంగా పేర్కొంది
  • భారత్‌లో జరుగుతున్న అభివృద్ధిని ప్రపంచమంతా చూస్తోంది
  • ఇక్కడ ఉన్న విపక్షాలకు మాత్రం అభివృద్ధి కనబడట్లేదు
  • విపక్షాల కళ్లు అహంకారంతో మూసుకుపోయాయి.. అభివృద్ధి కనిపించదు
  • ప్రజలు పేదరికం నుంచి బయటకు రావడం విపక్షాలు చూడలేవు
  • మూడు రోజులుగా విపక్షాలు వారి మనసులోని అక్కసంతా కక్కేశారు
  • విపక్షాల మనసు కాస్త తేలికపడి ఉంటుంది

17:30 August 10

  • తొమ్మిదేళ్లలో ఒక్క కుంభకోణం చూపించగలరా?
  • సుపరిపాలన అన్న దానికి మేము నిదర్శనంగా నిలిచి గెలుస్తున్నాం
  • ఆకాశం అంచులు దాటి ఆలోచిస్తున్న యువతకు సంపూర్ణ సహకారం అందిస్తున్నాం
  • ప్రపంచ యవనికపై భారత్‌ పాత్ర కీలకంగా మారుతోంది
  • ప్రపంచ అభివృద్ధిలో భారత భాగస్వామ్యం రోజురోజుకూ వృద్ధి చెందుతోంది
  • భారత్ ఆత్మవిశ్వాసం ప్రపంచానికి మార్గదర్శనంగా నిలుస్తోంది
  • భారత్‌ ఎంత బలంగా ఉందనడానికి విదేశీ పెట్టుబడులే నిదర్శనం
  • భారత్‌.. పెట్టుబడులకు, అవకాశాలకు స్వర్గంగా మారుతోంది

17:28 August 10

  • 21 వ శతాబ్దం భారత దేశానిది
  • ఈ సమయం భారత్‌కు అత్యంత కీలకమైనది
  • మీరు, మేము, కోట్లాది జనాభా అభివృద్ధికి సాక్షీభూతం
  • భారత్‌ స్వప్నాలు సాకారమయ్యే కీలక శతాబ్దమిది
  • 140 కోట్ల భారత జనాభా కలలు నెరవేరుతున్నాయి
  • ఇలాంటి సమయంలో మనందరి సంకల్పం అభివృద్ధి కావాలి
  • అభివృద్ధి అన్నది మనందరి తారకమంత్రం కావాలి
  • మన విభేదాలు, వైరుధ్యాలు దాటి అభివృద్ధి మనందరి లక్ష్యం కావాలి
  • యువతరం స్వప్నాలు సాకారం చేసి లక్ష్యసిద్ధికి పరుగెడుతోంది
  • యువత లక్ష్యాలకు సంపూర్ణ సాకారం అందాల్సిన బాధ్యత మనది
  • భాజపా అభివృద్ధిని గుర్తించి 2019లో మాకు సంపూర్ణ అధికారం ఈ దేశం ఇచ్చింది

17:26 August 10

  • విపక్షాలు అవిశ్వాసం పెట్టి అబాసుపాలయ్యాయి: ప్రధాని
  • క్రికెట్‌ భాషలో చెప్పాలంటే వరుస నోబాల్స్‌ వేస్తున్నారు: ప్రధాని
  • అధికారపక్షం ఫోర్లు, సిక్సులు కొడుతోంది: ప్రధాని
  • విపక్షాలు మాట్లాడిన ప్రతి మాట దేశమంతా శ్రద్ధగా వింటోంది: ప్రధాని
  • ఇప్పటివరకు దేశాన్ని మీరు నిరాశ, నిస్పృహల్లో ముంచడం తప్ప చేసిందేమీ లేదు
  • విపక్షాలు.. వాళ్లు తీసుకున్న గోతిలో వారే పడుతున్నారు
  • 1999లో శరద్‌ పవార్‌ నాయకత్వంలో అవిశ్వాసం పెట్టారు
  • 2003లో సోనియా నేతృత్వంలో అవిశ్వాసం పెట్టారు
  • 2018లో మళ్లీ అవిశ్వాస తీర్మానం పెట్టారు
  • ఇన్ని అవిశ్వాసాలతో ఏం సాధించారు
  • అవిశ్వాసాలు ఎందుకు పెడుతున్నారు.. అసలు మీ సమస్య ఏంటి
  • అధిర్‌ రంజన్‌ అవిశ్వాసం ప్రవేశపెడతామన్నారు.. ఎందుకు పెట్టలేదు
  • కోల్‌కతా నుంచి ఫోన్‌ వస్తే అధిర్‌ రంజన్‌ అవిశ్వాసం పక్కనపెట్టారా?
  • అధిర్‌ రంజన్‌ పరిస్థితి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నా

17:20 August 10

  • విపక్షాలు అవిశ్వాసం పెట్టి అభాసుపాలయ్యాయి: ప్రధాని
  • విపక్ష నేతలు... వాళ్లు తీసుకున్న గోతిలో వారే పడుతున్నారు: ప్రధాని మోదీ
  • క్రికెట్‌ భాషలో చెప్పాలంటే విపక్షాలు వరుస నోబాల్స్‌ వేస్తున్నాయి: ప్రధాని
  • విపక్షం నోబాల్స్‌ వేస్తుంటే అధికారపక్షం ఫోర్లు, సిక్సులు కొడుతోంది: ప్రధాని
  • విపక్షాలు మాట్లాడిన ప్రతి మాట దేశమంతా శ్రద్ధగా వింటోంది: ప్రధాని
  • ఇప్పటివరకు దేశాన్ని మీరు నిరాశ, నిస్పృహల్లో ముంచడం తప్ప చేసిందేమీ లేదు

17:18 August 10

  • 2018లోనూ మా ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టారు: ప్రధాని
  • మా ప్రభుత్వంపై ప్రజలు అనేకసార్లు విశ్వాసం చూపించారు: ప్రధాని
  • వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో ఎన్డీఏ సర్కారే వస్తుంది: ప్రధాని
  • అన్ని రికార్డులు బద్దలు కొట్టి ఎన్డీఏ అధికారంలోకి వస్తుంది: ప్రధాని
  • ఇటీవల మా ప్రభుత్వం కీలక బిల్లులు సభలో ఆమోదించింది: ప్రధాని
  • కీలక బిల్లులపై విపక్షాలకు ఏమాత్రం ఆసక్తి లేదు: ప్రధాని
  • దేశ ప్రజల పట్ల విపక్షాలు విశ్వాస ఘాతుకానికి ఒడిగట్టాయి: ప్రధాని
  • పేదల గురించి ఆలోచన లేదు.. అధికారంలోకి రావడమే వారి పరమావధి: ప్రధాని

17:12 August 10

  • లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోదీ సమాధానం
  • గతంలోనూ నా ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టారు: ప్రధాని మోదీ
  • మా ప్రభుత్వంపై ప్రజలు అనేకసార్లు విశ్వాసం చూపించారు: ప్రధాని

17:10 August 10

లోక్​సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తున్నారు. అంతకుముందు.. కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ కూడా సభకు చేరుకున్నారు.

15:38 August 10

పార్లమెంట్​లో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్​ అప్డేట్స్​

PM Modi Today Speech In Parliament :లోక్​సభలో ప్రధాని నరేంద్ర మోదీ.. మరికాసేపట్లో ప్రసంగించనున్నారు. విపక్షాల 'ఇండియా' కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మోదీ సమాధానమివ్వనున్నారు. అవిశ్వాస తీర్మానంపై గత మూడు రోజులగా లోక్​సభలో చర్చ కొనసాగుతోంది. అయితే మణిపుర్‌ హింసపై చర్చించేందుకే అవిశ్వాసం ప్రవేశపెట్టినట్లు కాంగ్రెస్‌ వెల్లడించింది. దీంతో ప్రధాని ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Last Updated : Aug 10, 2023, 7:52 PM IST

ABOUT THE AUTHOR

...view details