యాస్ తుపాను ప్రభావంపై సమీక్షించడానికి ఒడిశా, బంగాల్లో ప్రధాని మోదీ శుక్రవారం పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా మొదట భువనేశ్వర్లో సమీక్ష నిర్వహిస్తారని పీఎంఓ పేర్కొంది.
అనంతరం తుపాను ప్రభావిత ప్రాంతాలైన బాలేశ్వర్, భద్రక్, మెదినీపుర్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు ప్రధాని. బంగాల్లోనూ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.