ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఈ నెల 29 నుంచి నవంబరు 2 వరకు ఇటలీ(Modi Italy Visit), బ్రిటన్లలో పర్యటించనున్నారు. 16వ జీ-20 శిఖరాగ్ర సదస్సు(G20 Summit 2021) , ప్రపంచ నేతల కాప్-26 సదస్సులో(Glasgow Summit) ఆయన పాల్గొనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇటలీ ప్రధాని మారియో డ్రాఘీ, బ్రిటన్ ప్రధాని బోరీస్ జాన్సన్ సహా వివిధ దేశాధినేతలతో ద్వైపాక్షిక భేటీల్లో మోదీ పాల్గొననున్నారు. ఈ మేరకు విదేశాంగ శాఖ తెలిపింది.
16వ జీ-20 శిఖరాగ్ర సదస్సు.. ఇటలీలోని రోమ్‌లో అక్టోబరు 30-31 తేదీల్లో జరగనుంది. ఇటలీ ప్రధాని మారియో డ్రాఘీ ఆహ్వానం మేరకు ఆయన ఈ సదస్సులో(Modi Italy Visit) పాల్గొనేందుకు వెళ్లనున్నారు. జీ-20 సభ్య దేశాల ప్రభుత్వాధినేతలు ఈ సదస్సుకు హాజరుకానున్నారు.