తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేడు అసోం, బంగాల్​లో మోదీ పర్యటన - ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం అసోం, బంగాల్​లో పర్యటించనున్నారు. అసోంలో చమురు, గ్యాస్​ ప్రాజెక్టులను జాతికి అంతికమివ్వనున్నారు. సాయంత్రం బంగాల్​లో నోపార నుంచి దక్షిణేశ్వర్​ వరకు విస్తరించిన మెట్రో ప్రాజెక్టును ప్రారంభిస్తారు.

PM Modi to visit Assam
నేడు అసోం, బంగాల్​లో మోదీ పర్యటన

By

Published : Feb 22, 2021, 5:01 AM IST

బంగాల్​, అసోం రాష్ట్రాల్లో నేడు పర్యటించనున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఉదయం 11.30 గంటలకు అసోం దేమోజీ జిల్లాలోని శిలపతార్​లో చమురు, గ్యాస్​ ప్రాజెక్టులను ప్రారంభించి, జాతికి అంకితం ఇవ్వనున్నారు. ఇంజినీరింగ్​ కళాశాలలకు శంకుస్థాపన చేయనున్నారు. ఆయనతో పాటు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి, అసోం ముఖ్యమంత్రి, గవర్నర్​ పాల్గొననున్నారు.

నిరసనలకు ఆసూ పిలుపు..

అసోం ఒప్పందంలోని క్లాజ్​-6 అమలు చేయకపోవటంపై రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చింది ఆల్​ అసోం స్టూడెంట్స్​ యూనియన్​ (ఏఏఎస్​యూ). అన్ని జిల్లాలు, ఇతర ప్రధాన కేంద్రాల్లో విద్యార్థులు నల్ల జెండాలు, నల్ల బ్యాడ్జ్​లు ధరించి నిరసన తెలుపుతారని ఆసూ అధ్యక్షుడు దిపాంక కుమార్​ నాత్​ తెలిపారు.

బంగాల్​లో..

సోమవారం సాయంత్రం 4.30 గంటలకు బంగాల్​లోని హూగ్లీలో వివిధ రైల్వే ప్రాజెక్టులను మోదీ ప్రారంభించనున్నారు. బంగాల్​ నోపారా నుంచి దక్షిణేశ్వర్​ వరకు విస్తరించిన మెట్రో రైల్వేను జెండా ఊపి ప్రధాని ప్రారంభిస్తారు. కేంద్ర ప్రభుత్వం అందించిన రూ.464 కోట్లతో 4.1 కిలోమీటర్ల మేర ఈ ప్రాజెక్టును విస్తరించారు. సౌత్​ ఈస్టర్న్​ రైల్వేకు చెందిన కలైకుండ-ఝార్​గ్రామ్​ మధ్య మూడో రైల్వేను ప్రధాని ప్రారంభిస్తారు. రూ.1,312 కోట్లతో ఈ రైల్వే లైన్​ను నిర్మించారు. దాంతో పాటుగా వివిధ రోడ్డు, రైల్వే ప్రాజెక్టులను ఆయన ప్రారంభించి, జాతికి అంకితమివ్వనున్నారు.

ఇదీ చూడండి:'ఆ మ్యాచ్​లో నేనే గోల్​కీపర్​- ఎవరు గెలుస్తారో చూస్తా'

ABOUT THE AUTHOR

...view details