కొవిడ్ మహమ్మారిని ఎదుర్కునేందుకు మానవ వనరుల లభ్యతను పెంచే మార్గాల అన్వేషణకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆదివారం సమీక్షా సమావేశం జరిగింది.
'కరోనా యోధులపై పని భారం తగ్గించేదెలా?' - వైద్యుల కొరతపై మోదీ సమీక్ష
కరోనాపై పోరుకు సంబంధించి దేశంలో మానవ వనరుల లభ్యత వంటి అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్షించారు. ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులతో దేశంలోని వైద్య సిబ్బందిపై భారం పడుతోందన్న నివేదికల నేపథ్యంలో ఈ సమావేశం జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
మోదీ
కరోనా రెండో దఫా విజృంభణతో దేశంలోని కొన్ని చోట్ల వైద్య, ఆరోగ్య సిబ్బంది కొరత సహా.. అందుబాటులో ఉన్నవారిపై పనిభారం, ఒత్తిడి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. ఈ సమస్యను పరిష్కరించడంపై విస్తృత చర్చ జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించే సదుపాయాలు సైతం చాలా తక్కువగా ఉన్నట్లు ప్రధాని దృష్టికి వచ్చినట్లు వెల్లడించాయి.
ఇవీ చదవండి:దేశంలో మరో 3.92 లక్షల కరోనా కేసులు