జీ-20, ఐరాస వాతావరణ సదస్సు(కాప్26) సదస్సుల నేపథ్యంలో విదేశాల్లో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. భారత్‌కు తిరిగొచ్చిన వెంటనే దేశంలో వ్యాక్సినేషన్‌పై(Vaccination in India) సమీక్ష నిర్వహించనున్నారు.
ప్రధానమంత్రి కార్యాలయం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. టీకా మొదటి డోసు పంపిణీ 50 శాతం కంటే తక్కువ, రెండో డోసులో చాలా వెనుకంజలో ఉన్న ఆయా జిల్లాల్లో వ్యాక్సినేషన్‌పై(Vaccination in India) వీడియో కాన్భరెన్స్ ద్వారా సమీక్షించనున్నారు.
నవంబర్ 3న మధ్యాహ్నం 12 గంటలకు ఝార్ఖండ్, మణిపుర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయ సహా ఇతర రాష్ట్రాల్లోని దాదాపు 40 జిల్లాల కలెక్టర్లతో మోదీ(Modi news today) మాట్లాడతారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.