తెలంగాణ

telangana

35 పంట రకాలను జాతికి అంకితమివ్వనున్న మోదీ

By

Published : Sep 28, 2021, 5:34 AM IST

ప్రత్యేక లక్షణాలున్న 35 పంట రకాలను నేడు అందుబాటులోకి తీసుకురానున్నారు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi News). వర్చువల్ వేదికగా జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా.. రాయ్​పుర్​లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోటిక్ స్ట్రెస్ టాలరెన్స్ నూతన భవనాన్ని కూడా మోదీ ప్రారభించనున్నట్లు ప్రధాని కార్యాలయం పేర్కొంది.

modi
ప్రధాని మోదీ

వాతావరణ మార్పులకు అనుగుణంగా, టెక్నాలజీని ఉపయోగించి పంటసాగు చేసేలా ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi news).. 35 పంట రకాలను(Latest Crop varieties) మంగళవారం జాతికి అంకితమివ్వనున్నట్లు ప్రధాని కార్యాలయం పేర్కొంది.

అయితే.. 35 సరికొత్త పంటరకాలను భారత వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్​) అభివృద్ధి చేసినట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఈ ఏడాదిలోనే 35 వెరైటీ వంగడాలను ఐసీఏఆర్​ తయారు చేసినట్లు తెలిపింది.

వర్చువల్ వేదికగా జరగనున్న ఈ కార్యక్రమంలో భాగంగా.. రాయ్​పుర్​లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోటిక్ స్ట్రెస్ టాలరెన్స్ నూతన భవనాన్ని మోదీ(Modi latest news) ప్రారభించనున్నారు. ఈ కార్యక్రమానికి ముందు.. వివిధ వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు గ్రీన్ క్యాంపస్​ అవార్డును అందించనున్నారు మోదీ. అధునాతన టెక్నాలజీ ఉపయోగించి వ్యవసాయం చేసే రైతులతోనూ మాట్లాడనున్నారు.

ఇదీ చదవండి:

' దేశ ఆరోగ్య రంగంలో 'డిజిటల్ హెల్త్​​ మిషన్' విప్లవాత్మక నిర్ణయం '​

ABOUT THE AUTHOR

...view details