తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ సమావేశం - ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా ప్రభావం

ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు. ఆ రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై సీఎంలను అడిగి తెలుసుకోనున్నారు.

PM Modi to interact with CMs
సీఎంలతో మోదీ సమావేశం

By

Published : Jul 13, 2021, 5:21 AM IST

ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా వైరస్ ఉద్ధృతి పెరుగుతోన్న నేపథ్యంలో.. నేడు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి పరిస్థితిని సమీక్షించనున్నారు. ఉదయం 11 గంటలకు ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడనున్నారు.

ఇటీవల ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్‌, త్రిపురలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. త్రిపురలో డెల్టా ప్లస్ వేరియంట్ విజృంభిస్తున్నట్లు గణాంకాలు వెల్లడించాయి. ఆ రాష్ట్రాల్లో 'ఆర్‌ ఫ్యాక్టర్' ఒకటికి మించి ఉండటం ఆందోళనకరమని చెన్నైలోని 'ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేథమేటికల్‌ సైన్సెస్' పరిశోధకుల బృందం తెలిపింది. ఆర్‌ ఫ్యాక్టర్ 1 దాటిపోతే కరోనా మరింత ఉద్ధృతమయ్యే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

మరోవైపు.. మూడో ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాలు, ఆధ్యాత్మిక ప్రదేశాల్లో జన సమూహాలు దర్శనమివ్వడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. రెండో దఫా విజృంభణ ఇంకా ముగియలేదని..ప్రజలంతా కొవిడ్ నియమాలు తప్పక పాటించాలని కేంద్రం విజ్ఞప్తి చేస్తోంది.

ఇదీ చూడండి:'సాగు రంగంలో పోస్ట్​ హార్వెస్ట్​ విప్లవం రావాలి'

ABOUT THE AUTHOR

...view details