తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Pm Modi News: ఉత్తర్​ప్రదేశ్​లో ప్రధాని మోదీ పర్యటన - లఖింపుర్ ఖేరి వార్తలు

ప్రధాని నరేంద్ర మోదీ(Pm Modi News) మంగళవారం ఉత్తర్​ప్రదేశ్​లో పర్యటించనున్నారు. ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్​ @75 న్యూ అర్బన్ ఇండియా కార్యక్రమాన్ని లఖ్​నవూలో ప్రారంభించనున్నారు. అంతేకాక రాష్ట్రంలోని పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం పేర్కొంది.

PM Modi
ప్రధాని మోదీ

By

Published : Oct 5, 2021, 5:39 AM IST

ప్రధాని నరేంద్ర మోదీ(Pm Modi News) నేడు ఉత్తర్​ప్రదేశ్​లో పర్యటించనున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద.. 75 జిల్లాల్లోని 75వేల మంది లబ్ధిదారులకు ఇళ్లను డిజిటల్ వేదికగా ప్రారంభించనున్నారు. అనంతరం వారితో వర్చువల్​ సమావేశం నిర్వహించనున్నారు.

ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్​ @75 న్యూ అర్బన్ ఇండియా కార్యక్రమాన్ని లఖ్​నవూలో ప్రారంభించనున్నారు మోదీ. అక్టోబరు 5-7వరకు ఈ కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమంలో అన్నిరాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పాల్గొననున్నాయి.

స్మార్ట్ సిటీస్ పథకం కింద 75 పట్టణ ప్రాంత ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నట్లు ప్రధానమంత్రిత్వ కార్యాలయం పేర్కొంది.

లఖింపుర్(Lakhimpur Kheri News) ఘటన తర్వాత.. ప్రధాని మోదీ పర్యటిస్తున్న క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తత నెలకొంది.

ఇదీ చదవండి:'లఖింపుర్​ ఘటన'పై యోగి సర్కార్​కు నిరసన సెగ

ABOUT THE AUTHOR

...view details