చౌరీ చౌరా శత జయంతి ఉత్సవాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఉత్తర్ప్రదేశ్ గోరఖ్పుర్లోని చౌరీ చౌరాలో ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది. ఓ తపాలా బిళ్లను కూడా ప్రధాని ఆవిష్కరించనున్నారు. ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
చౌరీ చౌరా ఘటనకు వచ్చే ఏడాదికి వందేళ్లు నిండనున్న నేపథ్యంలో సంవత్సరం పాటు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. యూపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో 75 జిల్లాల్లో వచ్చే ఏడాది ఫిబ్రవరి 4వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి.
చౌరీచౌరా ఘటన జరిగిన ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్ జిల్లాలోని స్మారక కేంద్రాన్ని పర్యటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది యోగి సర్కార్.