ఫిన్లాండ్ ప్రధాని సన్నా మారిన్‌తో మంగళవారం వర్చువల్‌గా సమావేశం కానున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇరుదేశాల మధ్య నెలకొన్న ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా చర్చించనున్నారు. ఈ భేటీలో ప్రాంతీయ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సవాళ్లపైనా చర్చలు జరపనున్నట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది.
ఫిన్లాండ్ ప్రధానితో మోదీ వర్చువల్ సమావేశం - ఫిన్లాండ్ ప్రధాని
ఫిన్లాండ్ ప్రధాని సన్నా మారిన్‌తో మంగళవారం భేటీ కానున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. వర్చువల్ విధానంలో జరిగే ఈ సమావేశంలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా చర్చించే అవకాశముంది.
![ఫిన్లాండ్ ప్రధానితో మోదీ వర్చువల్ సమావేశం PM Modi to hold virtual summit with Finnish counterpart Marin on Tuesday](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11023950-thumbnail-3x2-hh.jpg)
ఫిన్లాండ్ ప్రధానితో మోదీ వర్చవల్ సమావేశం
ప్రస్తుతం భారత్‌లో దాదాపు 100కు పైగా ఫిన్లాండ్కు చెందిన కంపెనీలు ఉన్నాయి. భారత్‌కు చెందిన దాదాపు 30 కంపెనీలు ఫిన్లాండ్లో ఉన్నాయి. ఇరు దేశాలు సంయుక్తంగా.. కృత్రిమ మేధను ఉపయోగించి 'క్వాంటమ్ కంప్యూటర్'ను తయారుచేసే పనిలో నిమగ్నమయ్యాయి.
ఇదీ చదవండి :మయన్మార్‌లో మార్షల్ చట్టం- నిరసనలపై ఉక్కుపాదం
Last Updated : Mar 16, 2021, 6:08 AM IST