కరోనా కట్టడిలో భాగంగా.. దేశంలోని జిల్లాస్థాయి అధికారులతో ఈ నెల 20న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశంకానున్నారు. వర్చువల్గా జరిగే ఈ భేటీలో వివిధ అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. జిల్లా అధికారులను మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) వెల్లడించింది.
జిల్లా అధికారులతో ఈ నెల 20న మోదీ భేటీ - pm modi district officials news
కరోనాపై పోరులో కీలక పాత్ర పోషిస్తున్న జిల్లాస్థాయి అధికారులతో ప్రధాని మోదీ భేటీ కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ నెల 20న జరిగే సమావేశంలో మోదీ మాట్లాడతారని పీఎంఓ తెలిపింది.

జిల్లా అధికారులతో ప్రధాని మోదీ భేటీ
కరోనాపై పోరులో భాగంగా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు ప్రధాని. ఇటీవలే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ సమావేశమయ్యారు. అనంతరం విడివిడగా వారికి ఫోన్లు చేసి పరిస్థితులను తెలుసుకున్నారు.