తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యాస్​ తుపాను సన్నద్ధతపై మోదీ సమీక్ష - మరో తుపాను

తౌక్టే తుపాను సృష్టించిన బీభత్సాన్ని మరవకముందే యాస్​ తుపాను ముంచుకొస్తోంది. ఈ నేపథ్యంలో సన్నాహక చర్యలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. నేడు ఉన్నతస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. మరోవైపు.. ఈ తుపాను ముప్పు పొంచి ఉన్నందున తీర ప్రాంత రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.

PM Modi
మోదీ

By

Published : May 23, 2021, 8:31 AM IST

ముంచుకొస్తున్న 'యాస్'​ తుపానును ఎదుర్కోవడానికి చేపట్టిన సన్నాహక చర్యలపై ఉన్నత స్థాయి అధికారులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం సమీక్ష నిర్వహించనున్నారు. ఈ భేటీలో కేంద్ర హోంమంత్రి, సీనియర్ ప్రభుత్వ అధికారులు, జాతీయ విపత్తు నిర్వహణ(ఎన్​డీఎమ్​ఏ) ప్రతినిధులు, టెలికామ్​, విద్యుత్​, పౌర విమానయాన అధికారులు, సహా ఇతర మంత్రులు పాల్గొననున్నారు.

రాష్ట్రాలు అప్రమత్తం..

యాస్‌ తుపాను ముప్పు నేపథ్యంలో తూర్పు తీర రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. యాస్ తుపాను అతి తీవ్ర తుపానుగా మారి.. ఈ నెల 26న ఒడిశా- బంగాల్ మధ్య తీరం దాటనున్నట్లు భారత వాతావరణ విభాగం తెలిపిన నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు ముందస్తు చర్యలు చేపట్టాయి. ఉన్నత స్ధాయి సమీక్ష నిర్వహించిన బంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. సముద్ర, నదీ తీర ప్రాంతాల్లోని ప్రజలను త్వరగా సురక్షిత ప్రదేశాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. సహాయక సామగ్రిని తుపాను ప్రభావిత ప్రాంతాలకు పంపాలని సూచించారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. తుపాను పరిస్ధితిని సమీక్షించి సహాయక చర్యలు చేపట్టేందుకు ఏర్పాటు చేయనున్న కంట్రోల్‌ రూంలో మమత ఈ నెల 26న ఉండనున్నారు.

అటు తుపాను పరిస్థితిపై సమీక్ష నిర్వహించిన ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌.. అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజల ప్రాణాలను రక్షించడమే ప్రథమ ప్రాధాన్యంగా పని చేయాలని ఆదేశించారు.

ఇదీ చూడండి:వైరస్​ల వల్లే మనకు స్వచ్ఛమైన ఆక్సిజన్!

ABOUT THE AUTHOR

...view details