నీతి ఆయోగ్ పాలక మండలి ఆరో సమావేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం జరగనుంది. వ్యవసాయం, మౌలిక వసతులు, ఉత్పత్తి, మానవ వనరుల అభివృద్ధి, ఆరోగ్యం, కరోనా అనంతర పరిస్థితులు తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు.
అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, పలువురు కేంద్రం మంత్రులు, ఉన్నతాధికారులు ఈ పాలక మండలిలో సభ్యులుగా ఉన్నారు.
నీతి ఆయోగ్ పాలక మండలి ఆరో సమావేశంలో కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్ముకశ్మీర్‌తో పాటు తొలిసారి లద్దాఖ్ భాగం కానుంది. ఈసారి ఇతర కేంద్ర పాలిత ప్రాంతాల అధినేతలను సైతం ఆహ్వానించారు. అలాగే.. పాలక మండలి ఎక్స్ అఫిసియో సభ్యులు, వైస్ ఛైర్మన్, సభ్యులు, సీఈఓ, ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.