తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీ అధ్యక్షతన నేడు అఖిల పక్ష సమావేశం - govt's legislative agenda

బడ్జెట్​ సమావేశాల నిర్వహణపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు అఖిలపక్ష భేటీ జరగనుంది. వర్చువల్​గా ఈ సమావేశం నిర్వహించనున్నారు.

By

Published : Jan 30, 2021, 5:36 AM IST

పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో ప్రధాని అధ్యక్షతన శనివారం.. అఖిలపక్ష భేటీ జరగనుంది. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ఈ సమావేశం నిర్వహించనున్నారు. బడ్జెట్​ సమావేశాలకు సంబంధించి ప్రభుత్వ అజెండాను వివరించనున్నారు.

ఈ మేరకు అన్ని పార్టీల ప్రతినిధులకు ఆహ్వానం పంపినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్​ జోషి తెలిపారు.

తొలిసారి ఇలా..

పార్లమెంటు సమావేశాలకు ముందు అఖిల పక్ష భేటీ జరగడం ఆనవాయితీగా వస్తోంది. అయితే.. ఎప్పుడూ సమావేశాలకు ముందు జరిగే ఈ భేటీ.. ఈసారి ప్రారంభమైన ఒకరోజు తర్వాత జరగనుండటం గమనార్హం.

పార్లమెంటు బడ్జెట్​ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం.. అఖిలపక్ష సమావేశం నిర్వహించారు లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా. సభ సజావుగా సాగేలా విపక్షాలు హామీ ఇచ్చాయని ఆయన తెలిపారు.

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​.. ఫిబ్రవరి 1న బడ్జెట్​ ప్రవేశపెట్టనున్నారు.

ABOUT THE AUTHOR

...view details