తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దావోస్'​ సదస్సులో నేడు మోదీ ప్రసంగం - PM WEF ADDRESS

వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహిస్తున్న 'దావోస్ అజెండా' సదస్సులో ప్రధాని మోదీ నేడు ప్రసంగించనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు సమావేశంలో పాల్గొననున్నట్లు మోదీ ట్వీట్ చేశారు. సంస్కరణలు, సాంకేతికత వినియోగం సహా పలు అంశాలపై మాట్లాడనున్నారు.

pm-modi-to-address-wefs-davos-agenda-summit-thursday
దావోస్​ సదస్సులో నేడు మోదీ ప్రసంగం

By

Published : Jan 28, 2021, 5:08 AM IST

వరల్డ్ ఎకనామిక్ ఫోరం శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ప్రసంగించనున్నారు. భారత్​లో సంస్కరణలు, పెరిగిన సాంకేతికత వినియోగం సహా విస్తృతమైన అంశాలపై మాట్లాడనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు 'దావోస్ అజెండా' సమావేశంలో ప్రసంగించనున్నట్లు మోదీ ట్వీట్ చేశారు.

జనవరి 28న 'దావోస్ డైలాగ్' సమావేశంలో మోదీ పాల్గొంటారని ప్రధాని కార్యాలయం తెలిపింది. ప్రపంచంలోని ఉత్తమ పరిశ్రమ వర్గాలు ఇందుకు హాజరవుతారని పేర్కొంది. 'నాల్గో పారిశ్రామిక విప్లవం- మానవుల శ్రేయస్సుకు సాంకేతిక ఉపయోగం' అనే అంశంపై మోదీ ప్రసంగిస్తారని వెల్లడించింది. వివిధ సంస్థల సీఈఓలతోనూ వర్చువల్​గా భేటీ అవుతారని తెలిపింది.

'దావోస్ అజెండా' పేరుతో ఈ సమావేశాలు నిర్వహిస్తోంది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. భారీ స్థాయిలో జరుగుతున్న సదస్సులో మొత్తం వెయ్యి మంది వివిధ దేశాల నేతలు, కంపెనీల సీఈఓలు, ఛైర్మన్లు, ప్రపంచస్థాయి సంస్థల అధిపతులు పాల్గొంటున్నారు. ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం సంబంధిత విషయాలతో పాటు కరోనా తర్వాత ఎదురయ్యే సామాజిక, సాంకేతిక సవాళ్లపై వీరంతా చర్చిస్తున్నారు.

ఎన్​సీసీ ర్యాలీకి మోదీ

మరోవైపు, దిల్లీలోని కరియప్ప మైదానంలో జరిగే ఎన్​సీసీ ర్యాలీని ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి మోదీతో పాటు రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్, త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ హాజరుకానున్నట్లు పీఎంఓ తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details