తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేడు తమిళనాడు, కేరళలో మోదీ సుడిగాలి పర్యటన - ప్రధాని మోదీ

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నేడు తమిళనాడు, కేరళల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కేరళలో రెండు, తమిళనాడులో రెండు సభల్లో పాల్గొననున్నారు.

PM Modi
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

By

Published : Apr 2, 2021, 5:29 AM IST

తమిళనాడు, కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడేందుకు గడువు దగ్గరపడుతున్న క్రమంలో ప్రచారం ముమ్మరం చేసింది భాజపా. నేడు రెండు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.

కేరళలో ఇటీవలే పర్యటించిన మోదీ.. రెండో పర్యాయంలో నేడు రెండు సభల్లో పాల్గొననున్నారు. పతానమిట్ట జిల్లాలోని కోన్ని ఎన్నికల ర్యాలీలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఇదే జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప ఆలయం ఉన్న నేపథ్యంలో ప్రధానంగా ఈ గుడి అంశాలే మాట్లాడే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

కోన్ని ర్యాలీ తర్వాత.. మధ్యాహ్నం 1.15 గంటలకు తమిళనాడులోని కన్యాకుమారికి బయలుదేరుతారు మోదీ. అక్కడ సభ ముగించుకొని తిరిగి.. కేరళలోని తిరువనంతపురంలోని గ్రీన్​ఫీల్డ్​ మైదానంలో నిర్వహించే బహిరంగ సభకు హాజరయ్యేందుకు సాయంత్రం 5 గంటలకు తిరుగుపయణమవుతారు.

ప్రస్తుతం తమిళనాడులో ఉన్న మోదీ.. మధురైలో ఎన్నికల ర్యాలీ ముగించుకొని.. కేరళ వెళ్లనున్నారు.

ఇదీ చూడండి:'దీదీ.. ఇంకో స్థానం నుంచి పోటీ చేస్తారా?'

ABOUT THE AUTHOR

...view details