బంగాల్, అసోం రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదిక తెలిపారు. బంగాల్ ప్రజలకు మంచి పాలన అందించడమే భాజపా ఎజెండా అని పేర్కొన్నారు. మరోవైపు అసోం గురించి మాట్లాడిన మోదీ.. గత ఐదేళ్లలో పలు రంగాల్లో రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు.
"మార్చి 18న బంగాల్లోని సోదరి సోదరీమణులను కలుసుకునే అవకాశం లభించినందుకు ఆనందంగా ఉంది. నేను పురులియాలో ఓ ర్యాలీలో పాల్గొంటాను. బంగాల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించడమే భాజపా ప్రధాన ఉద్దేశం" అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.