వచ్చేవారం ఐరాసలో ఎడారీకరణ, భూమి క్షీణత, కరవుల నివారణపై జరిగే ఉన్నతస్థాయి సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించనున్నారు. ఈ మేరకు ఐరాస సాధారణసభ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
2019లో దిల్లీ వేదికగా ఎడారీకరణను ఎదుర్కోవటంపై ఐరాస ఆధ్వర్యంలో జరిగిన 14వ సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈనెల 14న ఉదయం.. ఏడారీకరణను ఎదుర్కోవటంపై ఐరాస నిర్వహించే ఉన్నతస్థాయి సమావేశంలో 14వ సదస్సు అధ్యక్షునిగా ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.