తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శాఖల్లో పారదర్శకత ఇక కేంద్ర మంత్రుల బాధ్యతే! - చింతన్​ శివిర్

వివిధ పథకాల అమలులో అవలంబించాల్సిన మెరుగైన విధానాల రూపకల్పన బాధ్యతను కేంద్రమంత్రి మండలికి (Council Of Ministers India) అప్పగించారు ప్రధాని నరేంద్ర మోదీ. మొత్తం 77 మంది ఉండగా వీరిని 8 గ్రూపులగా విభజించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇందులో నైపుణ్యం కలిగిన యువతతో పాటు రిటైర్డ్​ అధికారులకు ప్రాధాన్యం కల్పిస్తారని పేర్కొన్నాయి.

PM Modi tasks entire council of ministers to develop resources
మెరుగైన పాలనకు 8 గ్రూపులుగా కేంద్రమంత్రి మండలి

By

Published : Nov 14, 2021, 7:54 PM IST

సాంకేతికతను ఉపయోగించుకుని పాలనను కొత్త పుంతలు తొక్కించేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న మంత్రి మండలిలో (Council Of Ministers India) 77 మంది మంత్రులను 8 గ్రూపులుగా విభజించనున్నారు. ప్రతి గ్రూప్​లోనూ కొంతమంది నైపుణ్యం కలిగిన యువకులను, రిటైర్డ్​ అధికారులను నియమించనున్నారు. వీరి నుంచి సలహాలను తీసుకొని మెరుగైన విధానాలను రూపొందించి అమలు చేయనున్నారు. మంత్రుల కార్యాలయాల్లో మరింత పారదర్శకతను పెంపొందిచే దిశగా ఈ నిపుణుల బృందం ఇంకా ఎక్కువ మందిని నియమించకుకోనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

మంత్రి మండలిని మొత్తం ఎనిమిది గ్రూపులుగా విభజించే కసరత్తు అంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగింది. 'చింతన్​ శివిర్' పేరుతో నిర్వహించిన ఈ సమావేశాలు ఒక్కొక్కటి దాదాపు ఐదు గంటల పాటు జరిగాయి. వీటిలో వ్యక్తిగత సామర్థ్యం, ​సమర్థవంతమైన అమలు, మంత్రిత్వ శాఖ పనితీరు, పార్టీ సమన్వయం, నైపుణ్యాలు పెంపొందించే విధానాలు, అనుసరించాల్సిన పార్లమెంటరీ పద్ధతులపై చర్చించారు. ఈ సమావేశాలకు పార్లమెంట్​ ఉభయ సభాధిపతులు హాజరయ్యారు.

సమస్యలను ఎదుర్కోవడం, సమయ పాలన వంటి విషయాలపై అవగాహన కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. పాలనలో వేగం పెంచేందుకు ఈ బృందాలు ఉపయోగపడుతాయని పేర్కొన్నాయి.

ఇదీ చూడండి:భారత్​కు త్వరలోనే ఎస్​-400 క్షిపణులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details