తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కొవాగ్జిన్​ టీకా తీసుకున్న ప్రధాని మోదీ - modi covid vaccine news

PM Modi takes first dose of COVID-19 vaccine
కొవిడ్ టీకా తీసుకున్న ప్రధాని మోదీ

By

Published : Mar 1, 2021, 7:16 AM IST

Updated : Mar 1, 2021, 10:09 AM IST

07:14 March 01

కొవిడ్ టీకా తీసుకున్న ప్రధాని మోదీ

కొవిడ్ టీకా తీసుకున్న ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కరోనా టీకా తీసుకున్నారు. దిల్లీలోని ఎయిమ్స్​లో తొలి డోసును వేయించుకున్నారు. భారత్ బయోటెక్​ సంస్థ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాను ప్రధాని స్వీకరించారు. పుదుచ్చేరికి చెందిన నర్సు పీ నివేద సిరంజీ ద్వారా మోదీకి టీకా అందించారు. కేరళకు చెందిన మరో నర్సు సైతం అక్కడే ఉన్నారు.

ఈ సందర్భంగా కొవిడ్​పై పోరులో వైద్యులు, శాస్త్రవేత్తలు చేసిన కృషిని ప్రధాని కొనియాడారు. అర్హులైన వారందరూ టీకా వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందరం కలిసి భారత్​ను కరోనా రహిత దేశంగా మార్చాలని పిలుపునిచ్చారు.

ఉదయమే ఆస్పత్రికి

దిల్లీలోని సాధారణ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలిగించకూడదన్న ఉద్దేశంతోనే ఉదయం టీకా తీసుకున్నారు ప్రధాని. ఈ సందర్భంగా అసోంకు చెందిన గమ్చా(ప్రత్యేక వస్త్రం) ధరించారు. ఈ వస్త్రాన్ని అసోం మహిళల ఆశీర్వాదానికి గుర్తుగా భావిస్తారు.

ఉదయమే తెలిసింది: నర్సు

ప్రధాని వస్తున్నారనే విషయం తమకు ఉదయమే తెలిసిందని ఆయనకు టీకా ఇచ్చిన నర్సు నివేద తెలిపారు. మోదీకి కొవాగ్జిన్ ఇచ్చినట్లు చెప్పారు. 28 రోజుల తర్వాత రెండో డోసును అందిస్తామని వెల్లడించారు. తమ స్వస్థలం గురించి ప్రధాని అడిగారని నివేద చెప్పారు. 'టీకా వేసిన విషయం తనకు తెలియనే లేదు' అని మోదీ చెప్పినట్లు వివరించారు.

Last Updated : Mar 1, 2021, 10:09 AM IST

ABOUT THE AUTHOR

...view details