అధికారంలో ఉండడం మాత్రమే కాకుండా.. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Pm modi speech today) పేర్కొన్నారు. దేశ ప్రజలకు 'ప్రధాన సేవకుడి'గా వ్యవహరించడమే తన ప్రథమ కర్తవ్యమని తెలిపారు. ఈ మేరకు 83వ 'మన్ కీ బాత్'(Mann ki baat today) కార్యక్రమంలో ఆదివారం ఆయన ప్రసంగించారు.
"మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలతో ప్రజల జీవితాలు మారాయి. అది నాకెంతో సంతృప్తినిస్తుంది. నా జీవితం నుంచి నేను కోరుకున్నది కూడా అదే. అధికారంలో ఉండాలని నేనెప్పుడూ భావించను. ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
ఆ విజయానికి 50 ఏళ్లు..
1971లో జరిగిన యుద్ధంలో పాక్పై భారత్(Indo pak war 1971) విజయం సాధించి వచ్చే నెలనాటికి 50 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో.. సాయుధ దళాలను మోదీ ఈ కార్యక్రమంలో స్మరించుకున్నారు. ఆనాటి యుద్ధంలో అమరులైన మన దేశ సైనికులకు నివాళి అర్పించారు.
"డిసెంబరులో వాయుసేన దినోత్సవం, సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని ఈ దేశం జరుపుకోనుంది. డిసెంబరు 16నాటికి 1971 యుద్ధం జరిగి, 50 ఏళ్లు పూర్తవనుంది. ఈ సందర్భంగా నేను సాయుధ దళాలు, మన సైనికులు, వారికి జన్మనిచ్చిన తల్లులను స్మరించుకుంటున్నాను"