PM Modi Announced Turmeric Board and Tribal University in Telangana :పాలమూరు జిల్లా పర్యటనలోప్రధాని నరేంద్ర మోదీ 13,500 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం తెలంగాణకు మోదీ వరాలు ప్రకటించారు. జాతీయ పసుపుబోర్డు, ములుగు జిల్లాలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. నా కుటుంబసభ్యుల్లారా.. అంటూ తెలుగులో మాట్లాడిన ప్రధాని.. దేశంలో పండగల సీజన్ మొదలైందన్నారు.
Kajipet Wagon Factory : కాజీపేట రైల్వే వ్యాగన్ తయారీ పరిశ్రమ ఎలా ఉంటుందంటే..
PM Modi Speech in Mahabubnagar District :రాష్ట్రంలో ఎన్నో జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టామని ప్రధాని మోదీ (Narendra Modi) వివరించారు. జాతీయ రహదారుల నిర్మాణంతో అన్ని రాష్ట్రాలతో తెలంగాణకు అనుసంధానం పెరిగిందన్నారు. దేశంలో నిర్మించే 5 టెక్స్ట్రైల్ పార్కుల్లో హనుమకొండలో ఒకటి ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర పసుపు రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మోదీ హామీ ఇచ్చారు.
"కరోనా మహమ్మారి తర్వాత పసుపు గొప్పదనం ప్రపంచం మొత్తానికి తెలిసింది. అందుకే పసుపు డిమాండ్ బాగా భారీగా పెరిగింది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ నుంచి ఓ పెద్ద నిర్ణయాన్ని ప్రకటిస్తున్నాం. పసుపు రైతులకు మేలు జరిగేలా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. జాతీయ పసుపు బోర్డు ద్వారా పంట ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసి ప్రజలకు అందించేలా మౌలిక వసతులు కల్పిస్తాం. బోర్డు ఏర్పాటుతో రాష్ట్ర పసుపు రైతులతోపాటు దేశంలోని అన్నదాతలందరికీ ఎంతో ప్రయోజనం చేకూరుతుంది." - నరేంద్ర మోదీ, ప్రధాని
PM Modi Announced Tribal University in Telangana : హసన్-చర్లపల్లి పైపులైన్ వల్ల ఎల్పీజీ విస్తరణను సైతం పెంచేందుకు చర్యలు చేపట్టామని మోదీ తెలిపారు. కృష్ణపట్నం- హైదరాబాద్ మధ్య మల్టిపైప్లైన్ పనులు ప్రారంభించుకోవడం తెలంగాణ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. 900 కోట్లతో ములుగు జిల్లాకు కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం (Tribal University ) మంజూరు చేస్తున్నట్టు మోదీ ప్రకటించారు.