తెలంగాణ

telangana

ETV Bharat / bharat

PM Modi Speech at BJP Public Meeting in Nizamabad : 'బీఆర్​ఎస్​ దోచుకున్నది అంతా మళ్లీ ప్రజల ముందు ఉంచుతా' - ప్రధాని మోదీ పర్యటన

PM Modi Speech at BJP Public Meeting in Nizamabad : జీహెచ్​ఎంసీ ఎన్నికల తర్వాత ఎన్డీఏలో చేరతామని సీఎం కేసీఆర్​ తనను కలిశారని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. తెలంగాణ పాలన పగ్గాలు కేటీఆర్​కు ఇస్తానని.. అందుకు కేటీఆర్​ను ఆశీర్వదించాలని కేసీఆర్​ తనను కోరారని చెప్పారు. నిజామాబాద్​లో నిర్వహించిన బీజేపీ ఇందూరు ప్రజాగర్జన బహిరంగ సభలో ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సభకు ముందు రూ.8 వేల కోట్లతో అభివృద్ధి పనులు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఆ తర్వాత ఓపెన్​ టాప్​ జీపుపై మోదీ నిల్చుకుని.. ప్రజలకు అభివాదం చేశారు.

pm modi
pm modi sabha

By ETV Bharat Telugu Team

Published : Oct 3, 2023, 6:20 PM IST

Updated : Oct 3, 2023, 8:20 PM IST

PM Modi Speech at BJP Public Meeting in Nizamabad : వచ్చే ఐదేళ్లు తెలంగాణలో బీజేపీకి అధికారం ఇస్తే.. బీఆర్​ఎస్​ దోచుకున్నది అంతా మళ్లీ ప్రజల ముందు ఉంచుతానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi Telangana Tour) చెప్పారు. నిజామాబాద్​ జిల్లాలో పర్యటించిన ప్రధాని మోదీ.. ముందుగా రూ.8 వేల కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. ఇందూరులోని గిరిరాజ్​ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభావేదిక(BJP Public Meeting in Nizamabad)పై నుంచే.. రామగుండంలో ఎన్టీపీసీ రూ.6 వేల కోట్లతో చేపట్టిన విద్యుత్​ ప్రాజెక్టు(NTPC Electricity PROJECT)ను జాతికి అంకితం ఇచ్చారు. ఆ తర్వాత ఓపెన్​ టాప్​ జీపుపై మోదీ నిల్చుకుని.. సభావేదిక వద్దకు వెళ్లే వరకు ప్రజలకు అభివాదం చేశారు. మహిళలు, బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున మోదీకి ఘనస్వాగతం తెలిపారు.

అనంతరం బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ.. తెలంగాణ సీఎం కేసీఆర్​పై ఘాటైన విమర్శలు చేశారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్​ వైఖరి పూర్తిగా మారిపోయిందన్నారు. కేసీఆర్​ దిల్లీ వచ్చి తనను కలిశారని.. ఎన్డీయేలో చేరతామని.. తెలంగాణలో కేటీఆర్​ను ఆశీర్వహించాలని కోరినట్లు చెప్పారు. అయితే ఇది రాజరికం కాదని చెబుతూ.. బీఆర్​ఎస్​తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

Farmers Celebrations Over Turmeric Board Telangana : దశాబ్దాల కల నెరవేరిన వేళ.. పసుపు బోర్డు ప్రకటనతో రైతుల సంబురాలు

PM Modi Fires on CM KCR and BRS :"ఇంతకు ముందెప్పుడూ చెప్పని ఒక రహస్యం.. ఇవాళ మీకు చెబుతున్నాను. జీహెచ్​ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్​ వైఖరి పూర్తిగా మారిపోయింది. ఆ తర్వాత కేసీఆర్​ దిల్లీ వచ్చి తనను కలిశారు. తనపై ఎంతో ప్రేమ ఒలకబోశారని.. కేసీఆర్​ గతంలో ఎన్నడూ అంత ప్రేమ చూపలేదు. అది ఆయన వ్యక్తిత్వంలోనే లేదు. తన నేతృత్వంలోనే దేశం దూసుకుపోతోందని కేసీఆర్​ భజన చేశారు. తెలంగాణ పాలన పగ్గాలు కేటీఆర్​కు ఇస్తానన్నారు. ఆయన ఆశీర్వదించాలని కోరారు. ఇది రాజరికం కాదని.. తాను కేసీఆర్​కు గట్టిగా చెప్పాను. జీహెచ్‌ఎంసీ మేయర్ ఎన్నికలో మద్దతివ్వాలని అడిగారు. విపక్షంలోనైనా కూర్చుంటాం కానీ, మద్దతు ఇవ్వనని తెగేసి చెప్పాను. తెలంగాణ ప్రజలకు ద్రోహం చెయ్యనని కేసీఆర్‌కు స్పష్టం చేశాను. కేసీఆర్‌ కోరినా.. బీఆర్​ఎస్ ఎన్డీయేలో చేరేందుకు నేను అంగీకరించలేదని" ప్రధాని మోదీ చెప్పారు.

PM Modi Palamuru Praja Garjana Public Meeting : 'తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. రాబోయేది చెప్పింది చేసే ప్రభుత్వం'

"ఇంతకు ముందెప్పుడూ చెప్పని ఒక రహస్యం.. ఇవాళ మీకు చెబుతున్నాను. జీహెచ్​ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్​ వైఖరి పూర్తిగా మారిపోయింది. దిల్లీకి వచ్చిన కేసీఆర్​.. తనపై ఎంతో ప్రేమ ఒలకబోశారు. కేసీఆర్​ గతంలో ఎప్పుడూ ఇలా అంత ప్రేమను చూపలేదు. తెలంగాణ పాలన పగ్గాలు కేటీఆర్​కు ఇస్తానన్నారు. కేటీఆర్​ను ఆశీర్వదించాలని కోరారు. ఇది రాజరికం కాదని.. తాను కేసీఆర్​కు గట్టిగా చెప్పాను. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలన్నారు. మద్దతు ఇవ్వం అని తేల్చి చెప్పాను. కేసీఆర్​ కోరినా.. బీఆర్​ఎస్​ ఎన్టీఏలో చేరేందుకు తాను అంగీకరించలేదు."- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

PM Modi Tour in Nizamabad :కొన్ని రోజుల క్రితమే మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదించినట్లు గుర్తు చేసిన మోదీ.. భరతమాత రూపంలో సభకు వచ్చిన మహిళలకు అభినందనలు తెలిపారు. మహిళలు తన సభకు పెద్ద సంఖ్యలో రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని.. భవిష్యత్​లో మరింత మహిళా శక్తిని తాము చూడనున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచానికి కొవిడ్​ వ్యాక్సిన్​ అందించిన ఘనత తెలంగాణకే దక్కుతుందని ప్రధాని ప్రశంసించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రతిఫలాలు అన్నీ ఒకే కుటుంబమే అనుభవిస్తోందని దుయ్యబట్టారు. కేసీఆర్​, ఆయన కుమారుడు, కూతురు, అల్లుడు మాత్రమే ధనికులయ్యారని ధ్వజమెత్తారు. దీనిని అడ్డుకునేందుకే తెలంగాణ యువత కుటుంబ పాలనకు మరో అవకాశం ఇవ్వవద్దని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

PM Modi Speech at BJP Public Meeting in Nizamabad బీఆర్​ఎస్​ దోచుకున్నది అంతా మళ్లీ ప్రజల ముందు ఉంచుతా

Modi In Chhattisgarh : 'కాంగ్రెస్​ పాలనలో అవినీతి, నేరాలు బాగా పెరిగిపోయాయి'.. ఛత్తీస్​గఢ్​ ప్రభుత్వంపై మోదీ ఫైర్​

'రాష్ట్రానికి గిరిజన విశ్వవిద్యాలయం, పసుపు బోర్డు' ప్రకటించిన ప్రధాని

Last Updated : Oct 3, 2023, 8:20 PM IST

ABOUT THE AUTHOR

...view details