తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'విదేశాలకు బహుమతిగా 56 లక్షల డోసుల టీకా' - అనురాగ్​ శ్రీవాత్సవ

తమ దేశానికి పెద్దఎత్తున వ్యాక్సిన్​ను అందించడంపై దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమాపోసా.. భారత ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ప్రధానికి రమాపోసా ఫోన్ చేశారు. ప్రపంచ దేశాలకు భారత వ్యాక్సిన్‌ సేవలు కొనసాగుతాయని మోదీ స్పష్టం చేశారు.

PM Modi speaks to South African Prez; assures medical assistance
'ప్రపంచ దేశాలకు భారత వ్యాక్సిన్‌ సేవలు కొనసాగుతాయి'

By

Published : Feb 5, 2021, 8:09 AM IST

ఆఫ్రికా సహా అన్ని దేశాలకూ అవసరమైన వ్యాక్సిన్లు, ఫార్మాస్యూటికల్స్‌ను ఉత్పత్తిచేసే సామర్థ్యం భారత్‌కు ఉందని, ఇది కొనసాగుతుందని.. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమాపోసాకు ప్రధాని మోదీ తెలిపారు. నేతలిద్దరూ గురువారం ఫోన్‌లో సంభాషించుకున్నారు. ఉభయ దేశాల్లో మహమ్మారి కారణంగా ఎదురవుతున్న సవాళ్లు, టీకా కార్యక్రమంపై వారిద్దరూ చర్చించుకున్నట్టు ప్రధాని కార్యాలయం గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.

విదేశాలకు బహుమతిగా 56 లక్షల డోసులు‌!

వివిధ దేశాలకు భారత్‌ 56 లక్షల డోసుల కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను బహుమతిగా, మరో 100 లక్షల డోసులను వాణిజ్యపరంగా అందించినట్టు విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ గురువారం వెల్లడించారు.

భూటాన్‌, మాల్దీవులు, బంగ్లాదేశ్‌, నేపాల్‌, మయన్మార్‌, మారిషస్‌, శ్రీలంక, యూఏఈ, బ్రెజిల్‌, మొరాకో, ఒమన్‌, ఈజిప్ట్‌, కువైట్‌, అల్జీరియా, దక్షిణాఫ్రికా, సీషెల్స్‌, బహ్రెయిన్‌లకు టీకాలను ఎగుమతి చేశాం. త్వరలోనే పసిఫిక్‌ ద్వీపాలు, అఫ్గానిస్థాన్‌, మంగోలియా, నికరాగువాలకు వ్యాక్సిన్లు చేరుకుంటాయి.

-అనురాగ్‌ శ్రీవాస్తవ

స్థానిక అవసరాలను పరిగణనలోకి తీసుకున్నాకే విదేశాలకు వాటిని ఎగుమతి చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.

ఇదీ చదవండి:'భారత్​తో శత్రుత్వాన్ని తొలగించాల్సిన బాధ్యత పాక్​దే'

ABOUT THE AUTHOR

...view details