భారత్- ఆస్ట్రేలియా (India-Australia Partnership) సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై ప్రధాని నరేంద్రమోదీ.. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్‌తో చర్చించారు. దీనితోపాటు రానున్న క్వాడ్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై మాట్లాడారు. ఇరు దేశాల అభివృద్ధి గురించి ప్రధానంగా చర్చించినట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
" రాబోతున్న క్వాడ్ సమావేశాలను దృష్టిలో ఉంచుకుని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్‌తో చర్చించాను. ఇరుదేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై కూడా మాట్లాడాము."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి