కేరళ ఎన్నికల ప్రచార ర్యాలీలో అధికార, ప్రతిపక్ష పార్టీలపై విమర్శలతో విరుచుకుపడ్డారు ప్రధాని నరేంద్ర మోదీ. అధికార దుర్వినియోగం, అవినీతి, రాజకీయ హింస వంటి విషయాల్లో యూడీఎఫ్, ఎల్డీఎఫ్ కూటములను కవలలుగాఅభివర్ణించారు. పతనంథిట్ట జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు.
"యూడీఎఫ్, ఎల్డీఎఫ్ కూటములు కవలలు. అధికార దుర్వినియోగం, అవినీతి, రాజకీయ హింస, మతతత్వం, కులతత్వం, అశ్రిత పక్షపాతం, స్వపక్షపాతం వంటి లక్షణాలు వారికి ఉన్నాయి. వారు కవలలు కాబట్టే.. యూడీఎఫ్‌కు ఎల్‌డీఎఫ్‌ను ఓడించే సామర్థ్యం, సుముఖత లేదు. ఈ నేపథ్యంలో ఎన్డీఏకు మద్దతు పెరగుతుందనడంలో సందేహం లేదు."
- ప్రధాని నరేంద్ర మోదీ