తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కరోనా కట్టడిలో మోదీ విఫలం.. రాజీనామా చేయాలి'

కరోనాను కట్టడి చేయటంలో విఫలమైనందుకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా చేయాలని బంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్‌ చేశారు. ప్రధాని.. తన కీర్తిని పెంచుకునేందుకు ఇతర దేశాలకు వ్యాక్సిన్​ పంపించారని, ప్రస్తుతం దేశంలో వ్యాక్సిన్ కొరత నెలకొందని మండిపడ్డారు.

mamata on modi
మోదీపై మమత ధ్వజం

By

Published : Apr 18, 2021, 6:46 PM IST

దేశవ్యాప్తంగా కరోనా కల్లోలానికి ప్రధాని నరేంద్ర మోదీ కారణమని ఆరోపించారు బంగాల్​ సీఎం మమతా బెనర్జీ. వైరస్​ను కట్టడి చేయటంలో ప్రధాని విఫలమయ్యారని.. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

కోల్​కతాలోని దాకురియా బ్రిడ్జ్ నుంచి కాళీఘాట్​ క్రాసింగ్ వరకు రోడ్ షో నిర్వహించారు మమత. బంగాల్​కు 5కోట్ల 40లక్షల టీకా డోసులను పంపించాలని విజ్ఞప్తి చేసినా.. ప్రధాని నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు.

కొవిడ్ నిబంధనలు వదిలి ర్యాలీలో వేల మంది
కోల్​కతాలో దీదీ రోడ్​ షో

" వైరస్​ను కట్టడి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఎలాంటి కార్యాచరణను పాటించలేదు. గుజరాత్​లో పరిస్థితి దయనీయంగా మారింది. దేశంలో ఆక్సిజన్​, ఔషధాల కొరతకు కారణం ఎవరు? బంగాల్​లో కరోనా తీవ్రత దృష్ట్యా రాష్ట్రానికి 5కోట్ల 40లక్షల టీకా డోసులు, ఆక్సిజన్‌, ఔషధాలను పంపించాలని ప్రధాని మోదీకి లేఖ రాశాను."

- మమతా బెనర్జీ, బంగాల్​ ముఖ్యమంత్రి

80 దేశాలకు కరోనా వ్యాక్సిన్​ను ప్రధాని సరఫరా చేయటంపై మమత స్పందించారు. మోదీ.. తన కీర్తిని పెంచుకోవటం కోసమే ఇతర దేశాలకు వ్యాక్సిన్​లు పంపించారని ఆరోపించారు. ఇప్పుడు దేశంలో టీకాల కొరత నెలకొందన్నారు.

కోల్​కతాలో దీదీ రోడ్ షో

ఇతర దేశాలకు వ్యాక్సిన్​లు పంపించేముందు మహారాష్ట్ర, యూపీ, బంగాల్​.. మిగతా రాష్ట్రాలకు అందించాలని సూచించారు.

ఇదీ చదవండి :రైల్వే సాయం కోరిన దిల్లీ ప్రభుత్వం

ABOUT THE AUTHOR

...view details