తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'యువతలో నైపుణ్యాభివృద్ధి దేశానికి అవసరం' - ప్రపంచ నైపుణ్యాభివృద్ధి దినోత్సవం

మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవడం అత్యంత ప్రాధాన్యమని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. వరల్డ్​ యూత్​ స్కిల్స్​ డే సందర్భంగా యువతకు ఆయన మార్గనిర్దేశం చేశారు.

pm modi on youth skills, world youth skills day
'యువతలో నైపుణ్యం పెంచడం దేశానికి అవసరం'

By

Published : Jul 15, 2021, 11:07 AM IST

Updated : Jul 15, 2021, 12:25 PM IST

వేగంగా మారుతున్న సాంకేతికత కారణంగా రాబోయే రోజుల్లో స్కిల్లింగ్, రీ స్కిల్లింగ్, అప్‌స్కిల్లింగ్‌లకు అధిక డిమాండ్ ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ప్రపంచ నైపుణ్యాభివృద్ధి దినోత్సవం సందర్భంగా దేశ యువతను ఉద్దేశించి వర్చువల్​గా మోదీ ప్రసంగించారు. రాబోయే తరం యువతలో నైపుణ్యాభివృద్ధి దేశానికి అవసరమని ఆయన అన్నారు.

"ఆదాయం రాగానే నేర్చుకోవడం ఆపకూడదు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎప్పటికప్పుడు నైపుణ్యాలను పెంపొందించుకునే వ్యక్తి మాత్రమే.. మనగలుగుతారు. ఈ సూత్రం ప్రజలకే కాక దేశాలకూ వర్తిస్తుంది"

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

యువతలో నైపుణ్యాభివృద్ధి.. ఆత్మనిర్భర్​ భారత్‌కు కీలకమైన పునాదిగా మోదీ అభివర్ణించారు. 1.25 కోట్లకు పైగా యువతకు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా ఎదుర్కొంటున్న సవాళ్లు.. వరల్డ్​ యూత్​ స్కిల్ డే ప్రాధాన్యాన్ని పెంచిందని అన్నారు.

ఇదీ చదవండి :పార్లమెంట్​ సమావేశాలకు సన్నద్ధమవ్వండి: మోదీ

Last Updated : Jul 15, 2021, 12:25 PM IST

ABOUT THE AUTHOR

...view details