గ్రామీణ భారతంలోని 2024 నాటికి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందించేందుకు ప్రారంభించిన జల్ జీవన్ మిషన్(Jal Jeevan Mission PM Modi) అసలు ఉద్దేశం సాకారం అవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.
లద్దాఖ్‌కు చెందిన ఓ మహిళ ఈ పథకం ద్వారా జీవితం ఎంత సాఫీగా మారిందో వివరించగా ఆ వీడియోను కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను మోదీ తన ట్విట్టర్ ఖాతాలో ట్యాగ్ చేశారు. జల్‌జీవన్ మిషన్ అసలు లక్ష్యం ఇదే అని ప్రధాని వివరించారు.